హైదరాబాద్‌లో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. తన తండ్రి పట్ల కర్కశంగా వ్యవహరించాడో కుమారుడు.. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని కిరాతకంగా కొట్టిచంపాడు. జీడిమెట్లలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో సత్యనారాయణ (63) అనే వ్యక్తి ఐదేళ్లుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్నాడు.. పక్షవాతంబారినపనడి మంచానికే పరిమితం అయ్యాడు.. అయితే, మద్యం మత్తులో తండ్రితో గొడవపడిన సురేష్ అనే కుమారుడు.. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయి కర్రతో, బెల్ట్‌తో సత్యనారాయణపై దాడికి…
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు, చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఇంకా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షలు పడుతున్నాయి. దీంతో, ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.. ఇక, భారీ వర్షాల దృష్ట్యా.. తెలంగాణ ప్రభుత్వం బుధవారం వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, వాతావరణశాఖ తాజా ప్రకటన ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో…
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము.. షెడ్యూల్ ప్రకారం ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించాల్సి ఉన్నా.. తన పర్యటనను రద్దుచేసుకున్నారామె.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కి ఆమె చేరుకోవాల్సి ఉంది.. బేగంపేట ఎయిర్ పోర్ట్ లో రాష్ట్రపతి అభ్యర్థికి ఘనస్వాగతం పలికిచేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తోంది.. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు సోమజిగూడలోని ఓ హోటల్లో మేధావులతో సమావేశం, ఆ…
ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు వెలుగు లోకి వచ్చాయి. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు నాగేశ్వరరావు చేయని ప్రయత్నాలు లేదని విచారణలో బయటపడింది. మరోవైపు కేసుకు సంబంధించి రాచకొండ పోలీసులు పక్కాగా ఆధారాలు సేకరిస్తున్నారు. దీనికి తోడు బాధితురాలు ఇల్లుతో పాటుగా రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ ని ఇప్పటికే అధికారులు తెప్పించుకున్నారు. సంఘటన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు నాగేశ్వరరావు ఎక్కడ ఉన్నారు? ఏంటి అనే విషయాన్ని పోలీసులు…
తెలంగాణలో మీట్ ప్రాసెసింగ్ రావాలని.. మీట్ ఇండస్ట్రీ భారతదేశానికే కాక ఇతర దేశాలకు కూడా మాంసం ఎగుమతి చేసే స్థాయికి రావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకం ఎక్కువగా చేపట్టాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో కురమ, గొల్ల సోదరులకు గొర్లు పంపిణీ చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. మన రాష్ట్రంలో ఎక్కువగా వరి పండిస్తున్నామని.. దీనికి ప్రత్యామ్నాయంగా పంటలు పండించాలని అన్నారు. రాబోయే రోజుల్లో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు కోసం కృషి…
రెండు రోజులుగా ఇండిగో ఎయిర్ క్రాప్ట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్లు మూమకుమ్మడి సిక్ లీవులు పెట్టినట్లు తెలుస్తోంది. తమకు ఇస్తున్న తక్కువ జీతాలకు వ్యతిరేకంగా హైదరాబాద్, ఢిల్లీల్లో సిక్ లీవుల్లో వెళ్లారని తెలుస్తోంది. గతంలో జూలై 2న ఇండిగో క్యాబిన్ సిబ్బంది ఒకే సారి సిక్ లీవులు తీసుకున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది. క్యాబిన్ సిబ్బంది సిక్ లీవుల్లో వెల్లడంతో దేశీయంగా 55 శాతం ఆలస్యం అయ్యాయి. అయితే వీరంతా ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ కు వెళ్లినట్లు…
రక్షణ కల్పించాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారాడు. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడడంతో పాటు ఆమె భర్తని తుపాకీతో బెదిరించాడు. చివరికి విధి రాసిన వింత నాటకంలో అడ్డంగా బుక్కయ్యాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారి పేరు నాగేశ్వరరావు. మారేడుపల్లి సీఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈనెల 7వ తేదీన హస్తినాపురంలో నివనిస్తోన్న ఓ మహిళ ఇంటికి వెళ్లిన సీఐ.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బయటకు వెళ్లిన భర్త…
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఒళ్లు కాలి మరొకడు ఏడ్చాడని వెనుకటికి ఒక సామెత ఉంది. ఇప్పుడు ఈ సామెత హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్‌కు సరిగ్గా సరిపోతుంది. ఉన్నోడు కార్లలో తిరుగుతూ ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతుంటే.. లేనోడు బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తూ ట్రాఫిక్జామ్లలో ఇరుక్కుపోయి నానా అవస్థలు పడుతున్నాడు. ట్రాఫిక్‌జామ్‌కు భారీ వర్షాలే కారణమని వాదించవచ్చు. కానీ అది 30 శాతం మాత్రమే. మిగతా 70 శాతం నానాటికీ పెరుగుతున్న కార్ల ట్రాఫిక్‌ను ప్రభుత్వాధికారులు అదుపు చేయలేకపోవడం…
టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంపై సంచలన ఆరోపణలు చేశారు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మదుయాష్కీ గౌడ్… ఆ మూడు పార్టీలు ఒక్కటేనని విమర్శలు గుప్పించిన ఆయన.. దేశంలో ఎక్కడ మతతత్వ అల్లర్లు జరిగిన హైదరాబాద్ తోనే లింక్ ఉంటుందన్నారు.. ఇక, ఇలాంటి సంఘటనలలో కేంద్రం సమగ్రమైన విచారణ జరిపించడంలో విఫలమైందని మండిపడ్డారు మధుయాష్కీ గౌడ్.. మరోవైపు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో జరిగిన సంఘటనలలో నిందితులకి భారతీయ జనతా పార్టీ వాళ్లతో లింకులు ఉన్నాయని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత..…