బాలీవుడ్ లో ఇప్పటి దాకా కనీవినీ ఎరుగని రీతిలో ప్రేమాయణం సాగిస్తున్న జంట ఎవరంటే హృతిక్ రోషన్, అతని మాజీ భార్య సుసన్నే ఖాన్ అనే చెప్పాలి. ఇద్దరూ విడాకులు తీసుకున్నా ఇప్పటికీ ఫ్రెండ్స్ లా మెలగులున్నారు. అంతటితో ఆగకుండా హృతిక్ తన గర్ల్ ఫ్రెండ్ సబా ఆజాద్ తోనూ , సుసన్నే తన బాయ్ ఫ్రెండ్ అర్సలాన్ గోనీతోనూ కలసి నలుగురూ ప్రేమయాత్రలు కూడా చేసి వచ్చారు. ఇప్పుడు వీరి ప్రేమాయణం గురించే బాలీవుడ్ జనం భలేగా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే హృతిక్ రోషన్ తన గర్ల్ ఫ్రెండ్ సబా ఆజాద్ చేయబోయే కాన్సర్ట్ కు ముందుగానే తనదైన రీతిలో విషెస్ చెప్పాడు. హృతిక్, సబా ఇటీవలే యూరప్ లో ప్రెమయాత్రలు చేసి వచ్చారు. అలా వచ్చీ రాగానే సబా కాన్సర్ట్ గురించి, తన ఇన్ స్టా గ్రామ్ లో కేక పుట్టించాడు. ఇంతకూ విషయమేమంటే, ఎలక్ట్రానిక్ బ్యాండ్ ‘మ్యాడ్ బాయ్’ అనే ట్రూప్ లో సబా కూడా ఓ సభ్యురాలు. ఈ ట్రూప్ ను నిర్వహిస్తోంది నజీరుద్దీన్ షా తనయుడు ఇమాద్ షా. త్వరలోనే హైదరాబాద్ లో ‘మ్యాడ్ బాయ్’ ట్రూప్ ఓ కాన్సర్ట్ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే హృతిక్, సబాకు ముందస్తుగా అభినందనలు తెలిపాడు.
ఇటీవల జరిగిన కరణ్ జోహార్ యాభయ్యో పుట్టినరోజు వేడుకలో హృతిక్, సబా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆ రోజున ఈ జోడీకి ఎర్ర తివాచీ పరచి మరీ స్వాగతం పలికారు. ఆ వేడుకలోనే పిక్ ను జత చేసి మరీ తన సోషల్ మీడియాలో ప్రియురాలికి ముందుగానే హైదరాబాద్ లో హంగామా చేయమని ఉత్సాహపరిచాడు హృతిక్. ఆ పిక్ కు సబా కూడా “యో హైదరాబాద్ … మీ కోసం మేమొస్తున్నాం. మాతో చిందులేయండి…’అంటూ క్యాప్షన్ పెట్టింది. హృతిక్, సబా కలసి ఉన్న పిక్ ను చూసి పలువురు అభినందిస్తూ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా హృతిక్ మాజీ భార్య సుసన్నే ఈ జోడీని చూసి “సో క్యూట్…” అంటూ కితాబు నివ్వడం మరింత విశేషంగా నిలచింది.