హైదరాబాద్ లో కుక్కల దాడిలో చాలా మంది చిన్నారులు ప్రాణాలను కోల్పోయిన సంగతి విదితమే .. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో కుక్కల దాడిలో చాలా మంది చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే.. ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటున్నా కూడా ఎక్కడో చోట కుక్కల దాడిలో చిన్నారులు మరణిస్తున్నారు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. స్కూల్ చిన్నారిపై కుక్క దాడి చేసింది.. ప్రస్తుతం చికిత్స పొందుతున్న చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.. ఈ దారుణ ఘటన హైదరాబాద్ సనత్ నగర్ లో చోటు చేసుకుంది..
వివరాల్లోకి వెళితే.. సెయింట్ థెరిస్సా స్కూల్ లో విద్యార్థులపై కుక్క దాడికి పాల్పడింది. చిన్నారి స్కూల్ గ్రౌండ్‌లో ఆడుకుంటుండగా.. ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన విద్యార్థులు టీచర్ల కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఉపాధ్యాయులు కుక్కదాడిలో గాయపడ్డ చిన్నారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.. అయితే చిన్నారి పై దాడికి పాల్పడ్డ కుక్క ప్రిన్సిపల్ పెంపుడు కుక్కగా గుర్తించారు. దీంతో పాఠశాల ప్రిన్సిపల్ స్కూల్‌కు కుక్కను ఎలా తీసుకొస్తారని స్టూడెంట్ పేరెంట్స్ మండి పడుతున్నారు.. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు తో కేసు నమోదు చేసిన పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు..
హైదరాబాద్ నగరంలో కుక్కల దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా.. ఏక్కడో ఒకచోట కుక్కదాడులు జరుగుతూనే ఉన్నాయి. చిన్నారులు, పెద్దలు డాగ్ ఎటాక్స్‌కు గురవుతూనే ఉన్నారు. కుక్కలు కన్పిస్తే చాలు చిన్నలు, పెద్దలు భయాందోళన కు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డాట్ ఎటాక్స్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మొన్న వార్డ్ ఆఫీసుల ప్రారంభోత్సవంలో కూడా మంత్రులు ఈ విషయం పై గట్టిగా చెప్పారు.. కానీ మళ్లీ ఇప్పుడు ఇలా జరగడం పై జనాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..