వికారాబాద్ లో దారుణం వెలుగు చూసింది..ప్రాణ స్నేహితుడు అని నమ్మిన ఫ్రెండ్ ను అతి దారుణంగా హతమార్చాడు..ఫ్రెండ్ భార్య పై కన్నేసిన కామాంధుడు అడ్డుగా ఉన్న ఫ్రెండ్ ను అతి కిరాతకంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..ఈ దారుణం వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలకేంద్రానికి చెందిన శేఖర్, గోపాల్ స్నేహితులు. పక్కపక్క ఇళ్ళలోనే వుండే వీరిద్దరూ ఉపాధినిమిత్తం హైదరాబాద్ లో వుంటున్నారు. శేఖర్ భార్యా పిల్లలతో కలిసి వుంటున్నారు. గోపాల్ మాత్రం ఒంటరిగానే నగరంలో ఉండేవాడు..
వీరిద్దరు కూడా కలిసి ఒకే చోట కూలీపనులకు వెళ్లేవారు. దీంతో తరచూ శేఖర్ ఇంటికి వెళుతుండేవాడు గోపాల్. ఈ క్రమంలో తన భార్యపై మోజుపడ్డ గోపాల్ కోరిక తీర్చాలని వేధిస్తున్నాడని శేఖర్ అనుమానించాడు. దీంతో స్నేహితుడిపై కోపంతో రగిలిపోయిన అతడు తగిన బుద్ది చెప్పాలని భావించాడు..రెండ్రోజుల క్రితం శేఖర్ కుటుంబంతో కలిసి స్వగ్రామం దౌల్తాబాద్ వెళ్ళాడు. ఇదే సమయంలో గోపాల్ కూడా గ్రామానికి వెళ్ళాడు. దీంతో తన భార్యకోసమే గ్రామానికి వచ్చాడని భావించిన శేఖర్ అనుమానం మరింత పెరిగింది. ఈ విషయాన్ని ఇక తేల్చేయాలని భావించిన శేఖర్ పార్టీ చేసుకుందామని చెప్పి గోపాల్ ను బయటకు తీసుకెళ్లాడు..
అనుకున్న విధంగా మద్యం సేవించి భోజనం చేసారు. ఆ తర్వాత తమవెంట మద్యం తీసుకెళ్లి పొలాల్లో కూర్చుని తాగారు. ఈ క్రమంలోనే ఇద్దరిమధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగింది. మద్యంమత్తులో గోపాల్ బీరు సీసాతో కొట్టడంతో శేఖర్ కిందపడిపోయాడు. వెంటనే అతడిపై బండరాయి వేయడంతో తీవ్ర రక్తస్రావమై స్ఫృహతప్పి పడిపోయాడు.. ఇక ఆ తర్వాత పక్కనే ఉన్న పెద్ద బండరాయితో మోదాడు..ఇక గోపాల్ తో కలిసి బయలకు వెళ్లిన భర్త రాకపోవడంతో శేఖర్ భార్యను అనుమానం వచ్చింది. కుటుంబసభ్యులంతా గోపాల్ వద్దకు వెళ్లి గట్టిగా నిలదీయగా దాడివిషయం బయటపెట్టాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబసభ్యులు కొనఊపిరితో పడివున్న శేఖర్ ను హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో శేఖర్ మృతిచెందాడు.. శేఖర్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు..