తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో బీజేపీ హైకమాండ్ ఫుల్ నజర్ పెట్టింది. ఇప్పటికే పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేసిన బీజేపీ పార్టీ ఇక జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇవాళ ( శుక్రవారం ) ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లాలో పర్యటించగా.. రేపు బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ కు వస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఈదురు గాలులతో కూడిన వానా పడుతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్ పేట, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, సికింద్రాబాద్, ఈసీఐఎల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, నారాయణ గూడలో వర్షం కురుస్తుంది. అయితే.. మరో రెండు గంటల పాటు నగరంలో భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ఎంఐఎం పార్టీకి చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్ చేశారు. బార్కాస్ సలాల లో ఇవాళ (శనివారం) ఓవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాటి ఘటనలో క్షతగాత్రుడిగా ఉన్న తనను ప్రాణాలకు తెగించి కాపాడిన ఎమ్మెల్యే బలాల, మజ్లీస్ కార్యకర్తలకు ఊపిరున్నంత వరకు రుణపడి ఉంటానన్నారు.
హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ లోని శ్రీ సాయి హై స్కూల్ దారుణం జరిగింది. 4వ తరగతి చదువుతున్న విద్యార్థినీపై ఓ కీచక ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. 4వ తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల చిన్నారిపై రాజ్ కుమార్ అనే మ్యాథ్స్ టీచర్ గత ఏడాది కాలంగా లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం బయటకు వచ్చింది.
హైదరాబాద్ లో దారుణం వెలుగు చూసింది.. లేక లేక ఎన్నో ఏళ్లకు పుట్టిన బిడ్డకు ఇన్ఫెక్షన్ పేరుతో ముక్కు లేకుండా చెయ్యడం పై తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. డాక్టర్లు చేసిన పనికి తల్లి దండ్రులు, బంధువులు ఆసుపత్రి బయట ఆందోళనకు దిగారు..వైద్యులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలిసిన సిబ్బంది చిన్నారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని చెప్పడంతో…
దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవల హెచ్చరిక లేఖ వచ్చినా...అధికారులు ఎందుకు అప్రమత్తం కాలేదు. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఘటనాస్థలానికి వెళ్లిన రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్...ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన 'టీ-9 టికెట్' సమయాల్లో TSRTC మార్పులు చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తొలిసారిగా ఈ టికెట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని తెలిపింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్ చెల్లుబాటు అయ్యేది. అయితే.. ప్రయాణికుల నుంచి వచ్చిన…
బస్సుల్లో ప్రయానించాలంటే జనాలు వణికిపోతున్నారు.. అటు రైలు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.. ఒకప్పుడు ప్రైవేట్ బస్సుల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.. కానీ ఈ మధ్య ప్రభుత్వం బస్సుల్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయి.. మొన్న కూకట్ పల్లి బస్సు ప్రమాదం మరువక ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. హైదరాబాద్ లో మరో బస్సు ప్రమాదానికి గురైంది.. అందుకే దూర ప్రాంతాలకు వెళ్లేవారు బస్సు ప్రయాణం అంటే గుండెల్లో వణుకు పుడుతుంది.. అయితే ఏసీ బస్సుల్లో ప్రమాదాలు…
Hyderabad Cricketer Tilak Varma Says My Parents Crying after Maiden India Call Up: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున గత రెండు సీజన్లలో అదరగొట్టిన హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మ భారత జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. జులై 12 నుంచి ప్రాంరంభం కానున్న వెస్టిండీస్ పర్యటనలోని ఐదు టీ20 సిరీస్ కోసం అతడిని భారత…
తెలంగాణాలో రోజూ రోజుకు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి.. అతి వేగం మే అందుకు కారణం అని పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.. అయిన వాహనదారులు వినకుండా ప్రాణాల ను పోగొట్టుకుంటున్నారు.. ప్రాణాలను తీస్తున్నారు.. మొన్నీమధ్య మైనర్ కారు యాక్సిడెంట్ మరువక ముందే ఇప్పుడు మరో దారుణ ఘటన జరిగింది.. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కీసరాలో ఈ ప్రమాదం జరిగింది.. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాద్గార్పల్లి…