ఎంఎంటీఎస్ ట్రైన్లు రాయగిరి స్టేషన్ వరకు పొడగించాలని గత ఆరేళ్ల క్రితమే కేంద్ర రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. మౌలాలి నుంచి ఘట్కేసర్ ట్రైన్లు ఉండగా.. అక్కడి నుంచి యాదాద్రికి కొత్తగా మూడో లైను వేయాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు సూచించింది. ఆయితే టెండర్ ప్రక్రియ ఆలస్యం కావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాదాద్రి ఎంఎంటీఎస్ ట్రైన్లు నడిపే విషయమై కీలక ప్రకటన చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశకు కేంద్ర ప్రభుత్వం…
సునకానందం కోసం కొందరు తనకు అనారోగ్యం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కొడాలి నాని.. నేను అనారోగ్యానికి గురైనట్టు సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు.. టీడీపీ దిగజారుడు తనానికి ఇది నిదర్శనం, నాకు క్యాన్సర్ అంటూ ఐ-టీడీపీ ద్వారా టీడీపీ ఇలాంటి ప్రచారాలు చేయిస్తోందని దుయ్యబట్టారు.
Fake Post: బతికున్న మనిషి చనిపోయాడంటూ ఓ వ్యక్తి సోషలో మీడియాలో పోస్ట్ చేశాడు. అది చూసి అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న బంధువులు చివరి చూపు కోసం ఆయన ఇంటికి బారులు తీరారు.
ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై ఫేక్ ప్రేమ ప్రతిపక్షాలది అయితే.. ఫెవికల్ ప్రేమ కేసీఆర్ ది అని ఆయన వ్యాఖ్యనించారు. ఎన్నికలు రాగానే అధ్యక్షులు మార్చుతున్నారు.. ఔట్ డేటెడ్ లీడర్లను చేర్చుకున్న మీకు ఓటమి తప్పదు అని హరీశ్ రావు అన్నారు. మీ ప్రయత్నాలు ఫలించావు.. మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీదే ప్రభంజనం అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
Crime News: ప్రస్తుతం ఉన్న యువతకు జీవితం విలువ తెలియడం లేదు. చిన్నదానికి, పెద్దదానికి ఆత్మహత్యే సరైన పరిష్కారమంటూ చావుతో చెలగాటలాడుతున్నారు. ఫోన్ పోయిందని, అమ్మానాన్న కొట్టారని, ఫెయిల్ అయ్యామని, ప్రియురాలు వదిలేసిందని.. ఇలా చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు వదిలేస్తున్నారు. తాజాగా ఒక వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అందరిలా చేయి, గొంతు కోసుకుంటే చనిపోను అనుకున్నాడో ఏమో.. ఏకంగా పురుషాంగాన్ని కోసుకొని మృతి చెందాడు.
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు ఆరు గంటల పాటు కొనసాగింది. ఇక, ఈ మీటింగ్ లో బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు జేపీ నడ్డా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మీటింగ్ లో దక్షిణాది రాష్ట్రాల్లో అనుసరించాల్సిన ఎజెండాను రూపొందించాలని ఈ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు,…
అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ రూ.100 కోట్లు ఖర్చు చేసిందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పై కేంద్ర సంస్థలు ఎందుకు దర్యాప్తు చేయడం లేదు.. ఈ విషయంలో బీజేపీకి నోటీసులు జారీ చేస్తారా? విచారణ జరిపిస్తారా?.. ప్రధాన మంత్రి మోడీ అవినీతి గురించి మాట్లాడటం విడ్డురంగా ఉంది-మంత్రి కేటీఆర్
ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాల పండగ సందర్భంగా ఈ సారి దేశానికి ప్రధాన మంత్రిగా కేసీఆర్ కావాలని అని కోరుకున్నట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది దేశవ్యాప్తంగా కావాలంటే కేసీఆర్ ప్రధాని అయితేనే ఈ డెవలప్మెంట్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అభివృద్ది చేస్తామని చేయడం లేదని మల్లారెడ్డి ఎద్దేవా చేశారు.
హుస్సేన్ సాగర్ లో నిర్వహిస్తున్న 37వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ గ్రాండ్ గా ముగిసింది. ఈ క్లోజింగ్ సెర్మనీలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొన్నారు. అయితే.. ఈ ఈవెంట్ లో గెలిచిన విన్నెర్స్ కి గవర్నర్ ట్రోఫీ లని అందించారు. హుస్సేన్ సాగర్ లో వారం రోజులపాటు నేషనల్ ర్యాంకింగ్ ఈవెంట్ జరిగింది. లేసర్ క్లాస్, లేసర్ స్టాండర్డ్, లేసర్ 4.7 కేటగిరీల్లో ఈ పోటీలు జరిగాయి.
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో గత కొంత కాలంగా రియల్ ఎస్టేట్ రంగంలో కొంత నిలకడగా ఉన్న విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ రంగంలో నిలకడగా ఉన్నప్పటికీ ఇండ్ల అమ్మకాల్లో మాత్రం హైదరాబాద్ నగరం దేశంలోని మిగిలిన మెట్రోపాలిటన్ నగరాల కంటే ముందుంది.