Property cheating: ఇటీవల కాలంలో కొందరు ఈజీమనీకి అలవాటు పడ్డారు. కష్టపడి పని చేయడం సాధ్యం కాదు.. ఈజీ మనీ కోసం కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను, అత్యాశపరులను లక్ష్యంగా చేసుకుని వారికిచ్చిన కాడిని దోచుకుంటున్నారు. ఒ వ్యక్తికి బిల్టిండ్ చూపించి సింపుల్ గా కోట్లు కొట్టేసిన ఘటన హైదరాబాద్ వెలుగు చూసింది. రెండంతస్తుల భవనం అమ్మకానికి ఉందని నమ్మించి రెండున్నర కోట్లకు కొన్నాడు. మోసపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Read also: Opposition Parties Meeting: ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు : మల్లికార్జున ఖర్గే
జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌కు చెందిన జమ్ముల సునీల్ కుమార్‌కు కొన్నాళ్ల క్రితం వెంకటేష్ ధనరాజ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అనతికాలంలోనే ఇద్దరూ దగ్గరయ్యారు. వెంకటేష్ సునీల్ కుమార్ మాట్లాడుతూ తార్నాకలో 400 గజాల స్థలం ఉందని, సోదరుడు ప్రసాద్ తో కలిసి బ్యాంకు రుణం తీసుకుని ఇంటి నిర్మాణం చేపట్టామన్నారు. నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. భవనంలోని మొదటి, రెండో అంతస్తులను రూ.2.60 కోట్లకు విక్రయించాలని నిర్ణయించినట్లు వెంకటేష్ సునీల్ కుమార్ కు తెలిపారు. తార్నాకలో నిర్మాణంలో ఉన్న ఇంటిని చూపించి అమ్మకానికి పెట్టారన్నారు. దాంతో సునీల్ కుమార్ ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు. సునీల్ రెండు విడతలుగా వెంకటేష్, అతని భార్య లక్ష్మిలకు రూ.2.40 కోట్లు చెల్లించాడు.
రిజిస్ట్రేషన్ సమయంలో మిగిలిన రూ.20 లక్షలు చెల్లించేందుకు ఇద్దరూ అంగీకరించారు. అయితే వెంకటేష్ గత కొంత కాలంగా ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా, ఆస్తి పత్రాలు ఇవ్వకుండా పరారీలో ఉన్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే వెంకటేష్ సునీల్ కుమార్ కథ విన్న వారందరూ ఏంటీ బ్రో ఎలా నమ్మినావు అంటున్నారు. ఇంత ఈజీగా మోసవేంటని అంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఇటువంటి వారిని త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Opposition Parties Meeting: ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు : మల్లికార్జున ఖర్గే