మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల వివక్షత చూపిస్తుందన్నారు. ఎరువుల తయారీ, సరఫరా భాద్యత కేంద్రానిదే.. ఉద్దేశ పూర్వకముగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఓపెన్ చేయట్లేదు.. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా పట్టించుకోట్లేదు.. మీకు చేతనైతే కేంద్రం మెడలు వంచి ఎరువులు తెండి.. రైతులు ఉద్యమించే వరకు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది..
Also Read:Horrific Incident in Visakha: విశాఖలో దారుణం: మైనర్ మూగ బాలికపై అత్యాచారం.. ఇద్దరు అరెస్ట్!
కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చెడగొట్టాలని బీజేపీ చూస్తుంది అని అనుమానం వస్తుంది.. రామచందర్ రావుకు అవగాహన లేదు, సోయి లేదు.. ఆయనకు రైతుల గురించి తెలియదు ఎరువుల గురించి తెలియదు.. పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రైతులకు ఎరువులు ఇవ్వాలని బాధ్యత లేదా?.. ఏరోజు అయినా కేంద్రానికి లేఖ రాసిండా?.. రైతుల సహకారంతో త్వరలో బీజేపీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడతాం.. దిగుబడి తక్కువైతే రాష్ట్ర ఆదాయం తగ్గి పోతుంది..
Also Read:JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!
తెలంగాణ ప్రభుత్వం రూ. 22వేల కోట్లు రైతులకు ఋణ మాఫీ చేసినందుకు ఎరువులు ఇవ్వట్లేదా?.. రైతు భరోసా ఇచ్చినందుకు ఎరువులు ఇవ్వట్లేదా.. కేంద్ర మంత్రుల కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలి.. కాంగ్రెస్ కు చెడ్డ పేరు తేవాలని పానిక్ కు గురి చేస్తుంది.. బీఆర్ఎస్ నాయకులు రైతులను పానిక్ కు గురి చేస్తున్నారు.. ఎరువులు ఇచ్చిన పార్టీకి ఓటు వేస్తామని బీఆర్ఎస్ అంటుంది. తెలుగు బిడ్డ సుదర్శన్ రెడ్డి కి ఓటు వేయండి.. రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్న విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశామని తెలిపారు.