Hookah Centre: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే హుక్కా సెంటర్లపై తెలంగాణ ప్రభుత్వం గతంలోనే నిషేధం విధించినా అనేకచోట్ల గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూనే ఉన్నాయి.
హైదరాబాద్ మెట్రో రైలు మరో అరుదైన రికార్డును సృష్టించింది. సోమవారం రోజు ఏకంగా 5.10 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చింది.. హైదరాబాద్ మెట్రో రైలు చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి.
Modi Hyderabad Tour: తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. జూలై 8న వరంగల్లో ప్రధాని పర్యటించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ నెల 8 న వారణాసి నుండి హైదరబాద్ కి ప్రధాని మోడీ ఉదయం 9.45 కి హాకిం పెట్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు.
హైదరాబాద్ లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కనకదుర్గ వైన్స్ షాప్ లో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కనకదుర్గ వైన్స్ లో మద్యం సేవించడానికి వచ్చిన నాగి అనే వ్యక్తి.. మద్యం సేవించి షాప్ లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. షాప్ సిబ్బంది కాళ్లు, చేతులు పట్టి రోడ్డుపై పడేశారు.. దీంతో సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
President Droupadi Murmu: హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకిముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వెంట.. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్,
బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ సునీల్ భన్సల్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. రెండు రోజుల పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఆయన సమీక్షించనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మారుస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సమావేశం నిర్వహిస్తుంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్కు రానున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు ఆమె హాజరుకానున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ఫోర్టుకు రాష్ట్రపతి చేరుకోనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ముర్ము నేరుగా రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు.
ప్రతి ఆరుగురిలో ఒకరు సంతానలేమి సమస్యను అనుభవిస్తున్నారు. అయితే ఇతరులకు దూరం అవుతామనే భయం, బిడియం, అపోహల కారణంగా చాలా మంది సంతాన సాఫల్య చికిత్సల సహాయం తీసుకోవడానికి వెనుకాడుతున్నారు.
హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఖలీల్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు. పాతకక్షల నేపథ్యంలోనే ఖలీల్ ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన ఉస్మాన్ కు ఖలీల్ మధ్య గత కొంత కాలంగా గొడవలున్నాయి. ఈ గొడవల కారణంగానే ఖలీల్ ను ఉస్మాన్ చంపేశాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.