Jeevitha Rajasekhar : యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ జీవిత దంపతులకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ సాయిసుధ మంగళవారం సంచలన తీర్పు ఇచ్చారు.
TS Aarogyasri: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో కొత్త డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులందరికీ ఈ కార్డులు అందజేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా ముసురు పడుతుండగా.. ఇవాళ్టి(బుధవారం) నుంచి మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
సైనిక్‌పురిలోని రాఘవ గార్డెన్స్‌కు చెందిన సురేష్ తన ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు సోమవారం ఈసీఐఎల్‌కు వెళ్తున్నాడు. ఇంతలో డ్రైవర్ రాజూరి జగదీష్ ఈసీఐఎల్ చౌరస్తా సమీపంలో రోడ్డు పక్కన కారును నిలిపాడు.
హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. హైవే లపై స్పీడ్ లిమిట్ పెట్టినా కూడా వాహనాదారులు పాటించడం లేదు.. దాంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.. నిన్న కారు ప్రమాదం జరిగింది.. నేడు మరో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు.. ఈ ఘోర ప్రమాదం మేడ్చల్ లో వెలుగు చూసింది.. శామీర్ పెట్ కీసర దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం…
EC Officers: త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారులు వివిధ పనులను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల సంఘంలో పలువురు అధికారులను మార్చి కొత్త నియామకాలు చేపట్టారు.
అమెరికాలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డికి తెలుగు ఎన్నారైలు కలిసి తమ విజ్ఞప్తిని లేఖ రూపంలో అందించారు. ఢిల్లీ, ముంబై వంటి అనేక ఇతర భారతీయ నగరాలు ఇప్పటికే USAలోని ప్రధాన నగరాలతో నేరుగా విమాన కనెక్షన్లను కలిగి ఉన్నాయని.. USA నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమానాన్ని నడపటం వల్ల పెద్ద పట్టణాలతో సమానంగా అభివృద్ది సాధ్యమౌతుందని ప్రవాసులు అన్నారు.
గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. అందరికి బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాల కోసం నాకు ఎక్కడ నుంచి అధికారిక ఇన్విటేషన్ రాలేదు అని ఆమె పేర్కొన్నారు. రాజ్ భవన్ మహిళలు మాత్రం నన్ను బోనాలకు ఆహ్వానించారు.. ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానం లేదు అని గవర్నర్ తెలిపారు.