హైదరాబాద్ లో 4 గంటలపాటు వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానతో నగరవాసులను వణికించింది. అంతేకాకుండా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరోవైపు రోడ్లపై ఉన్న వరద నీటిని జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. భారీ వర్ష నేపథ్యంలో.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షం ఒక్కసారిగా ఆగిపోవడంతో.. ఆఫీసు నుంచి వారందరూ రోడ్డెక్కారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Minister Roja: పవన్ కళ్యాణ్‌కు చిన్న మెదడు చితికింది.. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు
హైటెక్ సిటీ – జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు వాహనాలు నిలిచాయి. చార్మినార్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచింది. మూసారాంబాగ్ బ్రిడ్జిపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో గోల్నాక బ్రిడ్జి పై నుండి వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నారు. ఉప్పల్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, బాలానగర్, ప్రకాశ్ నగర్, ట్యాంక్ బండ్, ఐకియా సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట తదితర ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లు, రాజేంద్ర నగర్, అంబర్ పేటలలో 4 సెంటీమీటర్లు, గోషా మహల్ లో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
Deepika Pilli : స్టన్నింగ్ లుక్ తో అదరగొడుతున్న హాట్ బ్యూటి..
మరోవైపు నగరంలోని లంగర్ హౌస్ కుతుబ్ షాహీ మజీద్ పై పిడుగుపడింది. దీంతో మజీద్ పైన ఉన్న కలుషం కింద పడిపోయింది. అంతేకాకుండా మజీద్ గోడ పగుళ్లు వచ్చాయి. సంఘటన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. వెంటనే సమాచారం అందుకున్న ఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినిద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.