Gachibowli Accident:ప్లై ఓవర్ పై డివైడర్ ను ఢీ కొట్టిన బైక్.. మరో ఫ్లై ఓవర్‌పై ఎగిరిపడి ఒకరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gachibowli Accident: హైదరాబాద్‌లో ఒళ్లు గగుర్లు పుట్టించే యాక్సిండెంట్ చోటుచేసుకుంది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై నుంచి ఓ వాహనదారుడు కిందపడ్డాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై ఫ్లైఓవర్ దాటుతున్నారు. వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో వారిద్దరూ ఒక ఫ్లై ఓవర్ నుంచి మరో ఫ్లై ఓవర్‌పై పడిపోయారు. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరిలో ఒకరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Read also: Harish Rao: ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
మృతుడు గచ్చిబౌలికి చెందిన మధు (25)గా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మధు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో స్పోర్ట్స్ బైక్‌లపై యువకులు ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం మనం చూస్తున్నామని అన్నారు. కొందరు వ్యక్తుల వల్ల ఇతర వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ స్పోర్ట్స్ బైక్‌లపై ట్రాఫిక్ పోలీసులు కాస్త శ్రద్ధ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Harish Rao: ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!