భారీ వర్షం హైదరాబాద్ నగరానికి మరోసారి వణికించింది. ఇవాళ (సోమవారం) సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక ఆఫీసులు, ఇతర పనులు ముగిసిన సమయం కావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే, నగరంలో చాలా చోట్ల వాన నీరు రోడ్ల పైన నిలిచిపోయింది.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రేపు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10:30కు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 11 గంటల 15 నిమిషాలుకు కొల్హాపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
తెలంగాణలో ఒక్కసారి కూడా అసెంబ్లీని 30 రోజులు నడపక పోవడం చాలా బాధాకరం అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నా లాంటి చిన్న సభ్యుడితో.. సీనియర్ అయిన కేసీఆర్ అనిపించుకోవడం జాలి కలుగుతుంది అని ఆయన అన్నారు. శాసన సభను నడిపించడంలో ఇబ్బంది ఏంటి అంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. నేడు హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది.
మరికాసేపట్లో డా.బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం స్టార్ట్ కానుంది. ఈ మీటింగ్ లో 40 నుంచి 50 అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
Car Accident: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఫిలింనగర్ ఎలక్ట్రికల్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రికల్ బెంజ్ కారులో ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. ఓవర్ స్పీడ్ తో చెట్టు, ఎలక్ట్రికల్ పోల్, గోడని ఢీ కొట్టింది.
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వారు, హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటలా వారి సహకారంతో, విశాఖపట్నంలో రేపు, అంటే 30 జూలై 2023 నాడు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించటానికి సర్వం సిద్ధం చేశారు. గుర్తింపు కార్డులు ఉన్న సినిమా పరిశ్రమ కార్మికుల కుటుంబ సభ్యులు అందరూ ఈ క్యాంపువల్ల తగిన ప్రయోజనం పొందవచ్చు.
హైదరాబాద్ లో ఆదివారం విషాదం చోటు చేసుకుంది.. ఒకేసారి పలు చోట్ల ప్రమాదాలు జరిగాయి.. కేవలం గంటల వ్యవధిలోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.. ఈ రోజు ఉదయం పూట కేవలం మూడు గంటల వ్యవధిలోనే మూడు రోడ్డు ప్రమాదాలు జరగడం కలకలం రేపింది.. ఈ మూడు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. ఉదయం ట్యాంక్బండ్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎవరికి ప్రమాదం జరగలేదు. కానీ కారు మాత్రం పూర్తిగా దెబ్బతింది.. అయితే కారులో ఉన్న…
Central Team: నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డిఎంఎ) సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖ బృందం సోమవారం నుండి రాష్ట్రంలోని వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేయనుంది.
తెలంగాణ సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ ఎస్పీపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త పేటలోని TSSPDCL సీనియర్ అసిస్టెంట్ కు సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది.