హైదరాబాద్ నగరంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. అయినా రోడ్డు ప్రమాదాలు ఆగడం లేదు.
Online Games: ఒకప్పుడు ఈజీ మనీ కోసం పేకాట, బెట్టింగ్లు చేసేవారు. వాటికి బానిసలై.. లక్షల్లో నష్టాలు, అప్పులు తీర్చే మార్గం లేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాం.
అంబులెన్స్ సౌండ్ వినగానే వెంటనే దారి ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడటానికి అందరు సహకరిస్తారు.. అందులో వెళ్లే పేషంట్ పరిస్థితి ఎంత విషమంగా ఉందో అని కంగారు పడతారు.. అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మానవత్వం..కొన్ని సార్లు ట్రాఫిక్ లో అంబులెన్సు లు ఆగిపోతుంటాయి.. అలాంటి సమయంలో అందరు సాయం చేసి ఆ అంబులెన్స్ లోని పేషంట్ ప్రాణాలను కాపాడతారు.. అయితే తాజాగా హైదరాబాద్ లో ఓ ఘటన చోటు చేసుకుంది.. ఒక పేషెంట్ ను వెంటిలేటర్ మీద…
ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 టీ20 టోర్నీ జరుగుతుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని సిద్ధమయ్యాయి. ఎంఎస్డీసీఏ, బ్రైనియాక్స్ బీ, పల్లవి ఫౌండేషన్ సహకారంతో స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1ను నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ టీ20 ప్రీమియర్ లీగ్ బాయ్స్ అండర్-14, గర్ల్స్ అండర్-16 కేటగిరీల్లో జరుగనుంది.
Kishan Reddy: హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ నేత జి.కిషన్ రెడ్డి పర్యటించారు. యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, అంబర్పేటలో ప్రస్తుత పరిస్థితిని తెలియజేసి మురుగు కాలువలు, ఇంకుడు గుంతలు పొంగిపొర్లడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.
హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మున్నేరు వరద నీరు ఉద్ధృతంగా వస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, జాతీయ రహదారిపై వందలాదిగా వెహికల్స్ రెండు వైపులా నిలిచిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. జనాలు బయట కాలు పెట్టాలంటే భయంతో వణికి పోతున్నారు.. గత రెండు రోజుల నుంచి భారీగా వర్షాలు కురస్తూనే ఉన్నాయి..లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.. రోడ్లు నదులుగా మారాయి.. ఎటు చూసిన నీళ్లు కనిపిస్తున్నాయి.. ఎక్కడ ఏది ఉందో తెలియక వాహన దారులు ఇక్కట్లు పడుతున్నారు.. ఇక బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వర్షాలకు వాహనాలపై…