కోకాపేటలోని నియో పోలిస్ ఫేస్-2లోని భూములు హెచ్ఎండీఏకు కోట్లు కురిపించాయి. రికార్డు స్థాయిలో హైదరాబాద్ చరిత్రలోనే అత్యధికంగా ఎకరానికి రూ.100 కోట్లు ధర పలికింది.
కోకాపేటలోని నియో పోలిస్ ఫేజ్-2లో భూములు రికార్డు స్థాయిలో ధర పలికాయి. నియో పోలస్లో హెచ్ఎండీఏ ఎకరం భూమికి రూ.35 కోట్లుగా ధరను నిర్ణయించగా.. ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీపడ్డాయి.
రేపటి నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీ పార్టీలో చేరారు. తరుణ్ చుగ్, కిషన్ రెడ్డిల సమక్షంలో ఆమె కమలం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి చూడటం వల్లే బీజేపీ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు
పలు అక్రమాలకు పాల్పడ్డ నేపథ్యంలో ఈ క్లాబ్స్ పై కమిటీ వేటు వేసింది. 80 క్లబ్బులను తమ అధీనంలో పెట్టుకున్న 12 మంది గుర్తించి.. ఆ 12 మందితో పాటు వారి కుటుంబ సభ్యులు హెచ్‌సీఏ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించారు. అందుకోసమే.. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయా క్లబ్ల్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీలపై నిషేధం విధించింది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అతిపెద్ద ఎయిర్ బస్ కార్గో విమానం ఆగింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్ నిన్న (మంగళవారం) శంషాబాద్ విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగింది. ఇల్లా ఎయిర్‌బస్ బెలూగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రావడం ఇది సెకండ్ టైం.
డీ మ్యాట్ అకౌంట్ వివరాలు తీసుకుని నిందితుల బ్యాంక్ అకౌంట్లు వివరాలు ఇచ్చి అమౌంట్ ను వీరి అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు.. దాదాపు 140 మంది బాధితుల నుంచి కోటి ఎనిమిది లక్షల రూపాయల మోసం జరిగింది.. ఎనిమిది నెలలుగా ఈ మోసానికి పాల్పడుతున్నారు అని స్నేహ మెహ్రా పేర్కొన్నారు.
ప్రజలు అవయవ దానానికి ముందుకు రావాలని జీవన్ దాన్ ఇంచార్జి డాక్టర్ జి. స్వర్ణలత పిలుపునిచ్చారు. దేశంలో అవయవాల కోసం ఎదురుచూస్తున్న వారు చాలామంది ఉన్నారని, మరణించిన వ్యక్తి అవయవ దానం చేస్తే 8 నుంచి 9 మంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో తన దృష్టంతా అటువైపుగా మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది.