హైదరాబాదలో మత్తు పదార్ధాలు అమ్ముతున్న వారిపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. పాతబస్తీలోని బహదూర్ పురా పొలీసులు గంజాయి అమ్ముతున్న ఇద్దరీతో పాటు గంజాయి కొని, సేవించే వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితుల దగ్గర నుంచి 1190 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: SKN : కాలేజీ బాయ్స్ హాస్టల్లో రష్మీ ఫొటోలు.. పాపం ఇరకాటంలో పెట్టేశాడుగా!
ఇక, రాజేంద్రనగర్, జలాల్ బాబా నగర్ ప్రాంతానికి చెందిన షేక్ రియాజ్, ఎంఎం పహడికు చెందిన షేక్ కలీం వీరిద్దరు కారు డ్రైవర్లుగా పని చేస్తున్నారు. జల్సాలకు అలవాటుపడ్డ ఈ ఇద్దరు అధిక డబ్బు సపాధించాలనే దురాశాతో ధూల్ పేట ప్రాంతం నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగొలు చేసి చిన్న చిన్న ప్యాకేటులో ప్యాక్ చేసి అధిక ధరకు గంజాయికి అలవాటు ఉన్న వారికి అమ్ముతున్నారని సమాచారంతో.. ఏసీపీ సుధాకర్ అదేశాలతో సీఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో, డీఐ శ్రీశైలం తన సిబ్బందితో గట్టి నిఘా పెట్టింది.
Read Also: Cheater: ‘చీటర్’ వచ్చేస్తున్నాడు.. బీ రెడీ!
బహదూర్ పురా ఎక్స్ రోడ్డు దగ్గర వీరిద్దరు కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ తౌఫిక్ కు అమ్ముతుండగా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. అయితే, వీరి తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని మత్తు పదార్ధాలు సేవించి నేరాలకు పాల్పడి వారి అమూల్యమైన భవిష్యత్ ను దుర్వినియోగం చేసుకోకుండ తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఎవరైన మత్తు పదార్ధాలు అమ్ముతున్న వారి గురించి తెలిసిన తమకు తెలియజేయాలని పోలీసులు తెలిపారు.