హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ పరిధిలోని భోలక్ పూర్ లో భారీ పేలుడు సంభవించింది. అంజుమన్ స్కూల్ సమీపంలోని స్టీల్ స్ర్కాప్ దుకాణంలో కెమికల్ బాక్స్ పేలింది. ఈ ప్రమాదంలో గౌసిద్దిన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి శరీరం పూర్తిగా కాలిపోయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. పేలుడుకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.
Read Also: Madhyapradesh: ఖజురహో-ఉదయ్‌పూర్ ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌లో మంటలు
అయితే, స్క్రాప్ యార్డ్‌లో పనిచేస్తున్న బాధితుడు గౌసిద్దీన్ ఓ బాక్స్‌ను కట్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది అని పోలీసులు గుర్తించారు. ఆ బాక్స్‌లో రసాయనం లేదా పెయింట్ నిల్వ చేసినట్లు తాము అనుమానిస్తున్నట్లు, ఈ సందర్భంగా జరిగిన ప్రతిచర్య వల్ల అది పేలి ఉంటుందని ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ జహంగీర్ యాదవ్ పేర్కొన్నారు. ఇక, ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ముషీరాబాద్ ఇన్ స్పెక్టర్ జహంగీర్ యాదవ్ తెలిపారు. క్లూస్ టీం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరీక్షలు నిర్వహించింది.. పోలీసులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని ఆయన వెల్లడించారు.
Read Also: Uttar Pradesh: ఇంకా వరదనీటిలోనే ఉన్నావ్ గ్రామం.. తీవ్ర ఇబ్బందుల్లో జనాలు