హైదరాబాద్ లో నకిలీ ట్రాన్స్ జెండర్ల బెగ్గింగ్ మాఫియాలో కొత్తకోణం వెలుగులో వచ్చింది. రాజేష్, అనితలు కలిసి నకిలీ ట్రాంజెండలను తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. రాజేష్, యాదవ్ ల దగ్గర వంద మందికి పైగా నకిలీ ట్రాన్స్ జెండర్.. ఉదయం నుంచి సాయంత్రం వరకు చౌరస్తాలో బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. సాయంత్రం కాగానే కాలనీలు కమర్షియల్ ఏరియాలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడి దోపిడి చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: Disha Patani : పింక్ గౌను లో బార్బీ డాల్ లా మెరిసిన హాట్ బ్యూటీ..
మగవాళ్లే.. మహిళలు, ట్రాన్స్ జెండర్ గా అవతారం ఎత్తినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్, గంజాయినీ నకిలీ ట్రాన్స్ జెండర్లు రవాణా చేస్తున్నారు. ముఠా నాయకులు అనిత, రాజేష్, యాదవ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 19 మంది నకిలీ ట్రాన్స్ జెండర్లకు వైద్య పరీక్షలు నిర్వహించి జైలుకు తరలించారు. ఇదే ఇష్యూపై నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి మాట్లాడుతూ.. నార్త్ జోన్ పరిధిలో మహంకాళి, మారేడుపల్లి, రాంగోపాల్ పేట్, గోపాలపురం పీఎస్ పరిధిలో కేసులు నమోదు చేసాము.. రోడ్లపై బెగ్గింగ్ పేరుతో సామాన్యులకు ఇబ్బంది పెడుతున్నా..19 మందిని గుర్తించము.. మహిళలు, ట్రాన్స్ జెండర్స్ గా మారు వేషంలో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు.. బెగ్గింగ్ మాటున హారస్మెంట్లకు పాల్పడుతున్నారు అని ఆమె తెలిపారు.
Read Also: Anasuya Bharadwaj: గుక్క పెట్టి ఏడుస్తూ వీడియో షేర్ చేసిన అనసూయ.. అసలు ఏమైందంటే?
డబ్బులు ఇవ్వకపోతే వాహనదారుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు అని నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి తెలిపారు. 19 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే ట్రాన్స్ జెండర్స్.. 19 మందికి మెడికల్ టెస్ట్ లు సైతం పూర్తయ్యాయి.. రాజేష్ యాదవ్, అనిత ఈ టీం కి లీడర్స్.. ఎలా డబ్బులు వసూలు చేయాలో ట్రైనింగ్ ఇస్తారు.. ఇలాంటి వాళ్ళ వలన హైద్రాబాద్ సిటీకి బ్యాడ్ ఇమేజ్ వస్తుందని నార్త్ జోన్ డీసీపీ పేర్కొన్నారు. సాయంకాలం అయితే, క్రైమ్ ఆక్టివిటీస్ కి సైతం పాల్పడుతున్నారు అని ఆమె అన్నారు.
Read Also: V. Hanumantha Rao: బీసీలను కాంగ్రెస్ పార్టీ ఏకం చేస్తుంది..
బీహార్, ఆంధ్ర, తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి కొంతమందిని హైదరాబాద్ కు తీసుకువచ్చి ఈ దందా చేస్తున్నారు అని నార్త్ జోన్ డీసీపీ చందనదీప్తి తెలిపారు. ఈజీ మని కోసం చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.. కానీ వసూళ్లు చేస్తున్న డబ్బులు ఎమ్ చేస్తున్నారనేది దర్యాప్తు చేస్తున్నాము.. గంజాయి, డ్రగ్స్ ఏమైనా సరఫరా సైతం చేస్తున్నారా అనే దర్యాప్తు చేస్తున్నాము.. ఫెక్ ట్రాన్స్ జెండర్స్ వాళ్ల లీగల్ గా ఉన్న ట్రాన్స్ జెండర్స్ ఇబ్బందులు పడుతున్నారు.. బెగ్గింగ్ మాఫియాపై మా నిఘా పటిష్టంగా ఉంది.. బెగ్గింగ్ మాఫియాపై డ్రైవ్ కంటిన్యూ చేస్తాము.. ఈ గ్యాంగ్ కి లీడర్స్ వాళ్లకి షెల్టర్లు ఇస్తారు.. సంగీత్ చౌరస్తా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వీళ్లకి మెయిన్ షెల్టర్ ప్లేస్ అని డీసీపీ చందన దీప్తి అన్నారు.