ప్రతి పక్ష పార్టీలకు 11 సార్లు అవకాశం ఇస్తే ఏం పీకారు? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వీళ్లకు?.. బోర్ కొట్టిందనీ కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటారా?.. అభివృద్ది చేసే వాడు ఇంకొన్నేళ్లు ఉంటే తప్పేంటి?.. కర్ణాటకలో బిల్డర్స్ నుంచి కమిషన్ 40 నుంచి 400 కు పెరిగింది అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు బదిలీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. జస్టిస్ సుధీర్ కుమార్ ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయగా.. జస్టిస్ చిల్లకూర్ సుమలతను కర్ణాటక హైకోర్టుకు ట్రాన్స్ ఫర్ చేసింది.
నాంపల్లి బజార్ ఘాట్ అగ్నిప్రమాద కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనాసాగుతుంది. భవనంలో పలు ఆధారాలను క్లూస్ టీం సేకరిస్తుంది. బిల్డింగ్ ఓనర్ రమేష్ జైస్వాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. లక్డికపూల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో బిల్డింగ్ ఓనర్ అడ్మిట్ అయ్యారు.
నేడు హైదరాబాద్ నారాయణగూడలోని వైఎంసీఏలో రాత్రి 7 గంటల నుంచి రేపు తెల్లవారుజామున 3 గంటల వరకు సదర్ ఉత్సవ్ మేళా జరగనుంది. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తెలంగాణలో రెడ్డి, రావు ఎవరైనా సరే మా దగ్గర వంగాలి అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు భారత దేశంలో ప్రతి హిందూ- ముస్లింల గొడవలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అంటూ ఆయన వ్యాఖ్యనించారు.
నాంపల్లి బజార్ ఘాట్ ప్రమాదంపై అగ్నిమాపక శాఖ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. భవనంలో సేఫ్టీ లేదని ఫైర్ శాఖ వెల్లడించింది. అయితే, కెమికల్ డ్రమ్స్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడించింది.
ఒక వ్యక్తి గుర్తింపు కోసం ఎక్కువగా ఉపయోగపడే ఆధార్ కార్డు.. తప్పిపోయిన వికలాంగ బాలుడిని దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తన తల్లిదండ్రులను కలవడానికి ఉపయోగపడింది. 2015లో తప్పిపోయిన హైదరాబాద్ బాలుడిని తన తల్లిదండ్రుల వద్దకు చేర్చింది ఆధార్ టీమ్.
నాంపల్లి అగ్నిప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అంతకుముందు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
BiG Breaking: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సోమవారం ఉదయం 9.30 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లి బజార్ ఘాట్లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.