Off The Record: హైదరాబాద్ ఎందుకు హస్తగతం కాలేదు? ఆ వర్గాలు ఎటు మళ్లాయి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: కాంగ్రెస్ పార్టీ ఆశించినట్టుగానే.. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. కానీ, అనుకున్నన్ని సీట్లు మాత్రం రాలేదన్నది ఆ పార్టీ అగ్ర నేతల అభిప్రాయమట. జిల్లాల వారీగా ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే… గ్రామీణ ప్రాంతాల్లో అన్నిచోట్ల హస్తం హవా కనిపించింది. ఒక్క నిజామాబాద్ జిల్లాలో తప్ప మిగిలిన చోట్ల ఆశించిన స్థాయిలోనే వర్కౌట్ చేసుకోగలిగింది కాంగ్రెస్. కానీ… హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మాత్రం ఆ స్థాయి ప్రభావం చూపలేకపోయింది. మరీ ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎందుకు వెనకబడ్డామన్న చర్చ గట్టిగానే మొదలైందట పార్టీలో. గ్రేటర్ ప్రజలు బీఆర్‌ఎస్‌వైపు మొగ్గడానికి కారణాలపై పోస్ట్‌మార్టం మొదలైనట్టు తెలిసింది.
గ్రేటర్ హైదరాబాద్‌లో కచ్చితంగా గెలుస్తామనుకున్న ఖైరతాబాద్, ఎల్బీనగర్, మేడ్చల్, మల్కాజిగిరి, అంబర్‌పేట లాంటి నియోజకవర్గాలు చేజారడంపై పార్టీ వర్గాల్లోనే ఆశ్చర్యం వ్యక్తం అవుతోందట. ఎన్నికలకు ముందు మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సెటిలర్స్, టీడీపీ సానుభూతిపరుల ఓట్ బ్యాంక్ మొత్తం సాలిడ్‌గా తమకు మళ్ళుతుందని అంచనా వేసింది కాంగ్రెస్. కానీ.. ఫలితాలను చూస్తే.. అలాంటి ప్రభావం పెద్దగా లేదన్న నిర్ణయానికి వచ్చిందట. మరీ ముఖ్యంగా పార్టీ ఆశలు పెట్టుకున్న టిడిపి ఓటు బ్యాంక్ పెద్దగా కాంగ్రెస్ వైపు మళ్ళినట్టు కనిపించలేదు. అదే సమయంలో గ్రేటర్ పరిధిలో సెటిలర్స్ ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో కారు పార్టీకే పట్టం కట్టారు ఓటర్లు. అటు బీజేపీని కూడా ఆదరించారు తప్ప ఏ దశలోనూ కాంగ్రెస్ వైపు మొగ్గలేదు.
Also Read
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
- AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
తమకు బలమైన అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో సైతం ఓడిపోవడంతో… సెటిలర్స్, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తమకు పడలేదని, అవి బీఆర్‌ఎస్‌కే మళ్ళాయన్న అంచనాకు వచ్చారట కాంగ్రెస్ పెద్దలు. అంటే… ఆ వర్గాలన్నీ కాంగ్రెస్‌ను నమ్మలేదా? కలిసి నడవడానికి ఇష్టపడలేదా? లేక ఇంకేదైనా కారణం ఉందా అన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయనుకున్న గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమకు పట్టం కట్టారని, ఆశలు పెట్టుకున్న గ్రేటర్ పరిధిలో హ్యాండ్ ఇచ్చారన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో గట్టిగానే జరుగుతోందట. మొత్తంగా గ్రేటర్ వైఫల్యాలపై త్వరలోనే సమీక్ష జరిపి వ్యవహారాన్ని సెట్ చేయాలని పీసీసీ అనుకుంటున్నట్టు తెలిసింది.
తాజావార్తలు
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!