Hyderabad : మరోసారి భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్. చికెన్ ధరలు మరోసారి తగ్గాయి.. గతకొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతోన్న చికెన్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. కార్తీక మాసం కావడంతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. కరోనా సమయంలో ప్రజలు చికెన్‌ను విపరీతంగా తినేయడంతో ఒకానొక సమయంలో కిలో చికెన్ ధర ఏకంగా రూ. 300 వరకు చేరింది.. ఇప్పుడు సగానికి పడిపోయింది.. ఈరోజు ఇంకాస్త తగ్గినట్లు తెలుస్తుంది.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..
మొన్నటివరకు ఎలెక్షన్స్ కావడంతో ధరలు ఊపంధుకున్నాయి.. అయితే ఇప్పుడు కార్తీక మాసంతో ధరలు ఒక్కసారిగా సగానికి సగం తగ్గాయి. దీంతో ప్రస్తుతం కిలో చికెన్ విత్ స్కిన్ రూ. 150, స్కిన్‌లెస్ రూ. 170కి పడిపోయింది. ఇప్పుడు మరో రూ. 20 తగ్గింది.. స్కిన్ లెస్ ధర రూ. 145 ఉండగా, డ్రెస్సుడ్ చికెన్ ధర ప్రస్తుతం రూ. 128 గా ఉంది.. ఇంకా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. గడిచిన నాలుగు నెలల్లో కిలో చికెన్ ధర చేరుకున్న కనిష్ట ధర ఇదే కావడం విశేషం. కోళ్లు ఒక పరిమాణానికి వచ్చిన తర్వాత కచ్చితంగా వాటిని అమ్మేయాల్సిందే. లేదంటే వాటికి మేత ఎక్కువవడంతో పాటు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. దీంతో మార్కెట్లో డిమాండ్ తగ్గి, భారీగా కోళ్లు రావడంతో ఆటోమేటిగ్‌గా ధర తగ్గుతుంది.
Also Read
ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది.. ఒకవైపు చలి తీవ్రత ఎక్కువ.. మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ధరలు పూర్తిగా తగ్గాయి.. కొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్ ధరలు ఏకంగా 40 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. కార్తీక మాసం ముగిసే సమయానికి చికెన్ ధరలు ఇలాగే ఉండే అవకాశాలున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.. కార్తీక మాసం తర్వాత ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!