తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ కూడా తమ అగ్రనేతలను ఆహ్వానిస్తూ ప్రచార హోరును పెంచింది. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు మరోసారి రాష్ట్రానికి రానున్నారు.
రెండో రోజూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 30 ప్రాంతాల్లో ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్ లో సోదాలు కొనసాగుతున్నాయి.
Swadesh Store: దేశంలోని హస్తకళాకారులు, కళాకారులకు సహాయం చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి 'స్వదేశ్' స్టోర్‌ను ప్రారంభించింది. తెలంగాణలోని హైదరాబాద్‌లో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ ఈ స్టోర్‌ను ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఈ నెల 30వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ కూడా తమ అగ్రనేతలను ఆహ్వానిస్తూ ప్రచార హోరును పెంచింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభకు హాజరైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ నెల 11న రాష్ట్రానికి మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు.
ది పార్క్ హోటల్ తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో సోమాజిగూడలో ఇంటరాక్టివ్ మీటింగ్‌కు మంత్రి కేటీఆర్ హాజరై ఎన్నికల్లో పారిశ్రామికవేత్తల మద్దతు కోరారు. తాను ఇక్కడికి పూర్తి రాజకీయ నాయకుడుగానే వచ్చానని, మీ మద్దతు కావాలని పారిశ్రామిక వేత్తలను ఆయన కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Raja Singh: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీసీ స్వాభిమాన్ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. బీసీలకు భరోసా కల్పించే ఏకైక పార్టీ బీజేపీ అని, బీసీల అభివృద్ధికి పాటుపడుతుందని ప్రధాని పదే పదే చెబుతున్నారు.
Hyderabad: హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్లో ఘోర ప్రమాదం జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్లో లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ఇటీవల నిర్మించిన ఉప్పలాస్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నాగరాజు అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.