తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి ఇంకా ఢిల్లీలోనే బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన పేరును ప్రకటించడానికి ముందు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో హైదరాబాద్ నుంచి హుటాహుటిన బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. అప్పటికే హైకమాండ్ ఆయన పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఢిల్లీకి వెళ్లగానే తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మానిక్‌రావు థాక్రేతో పాటు కాంగ్రెస్ ఎంపీ మాణిక్ ఠాగుర్ ను రేవంత్ కలిశారు. ఇక, ఇవాళ ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలతో రేవంత్‌రెడ్డి వరుసగా భేటీ అవుతున్నారు.
Read Also: Rajasthan : కర్ణి సేన అధినేత సుఖ్ దేవ్ సింగ్ హత్య.. అట్టుడుకున్న రాజస్థాన్
ఇక, ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించిన నేపథ్యంలో వారిద్దరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు. కాగా, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో ఆయన సమావేశం అయ్యారు. రేపు (గురువారం) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగబోయే తన ప్రమాణస్వీకారానికి వారిని ఆహ్వానించారు. అదేవిధంగా రాష్ట్రంలో మంత్రి వర్గం ఏర్పాటు ఇతర అంశాలపై కూడా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో రేవంత్‌రెడ్డి చర్చించారు.
Read Also: Viral Video : వార్నీ.. ఇదేం పిచ్చిరా బాబు.. డబ్బులిచ్చి మరీ అవసరమా…
అయితే, రేపు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం సమయంలో స్వల్ప మార్పులు చేశారు. రేపు మధ్యహ్నం 1. 04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై సౌందర్యరజన్ ప్రమాణం చేయించనుంది. ఇక, ఎల్బీ స్టేడియానికి సీఎస్ శాంతికుమారితో పాటు డీజీపీ రవిగుప్తా, సీపీ సందీప్ శాండిల్య వెళ్లనున్నారు. ప్రమాణస్వీకార ఏర్పాట్లు, భద్రతను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.