Person came to the polling station with Oxygen Cylinder to Cast his Vote: ఈరోజు ఉదయం 7 గంటల నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఈసారి పోలింగ్‌లో యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మహిళలతో పాటు వృద్ధులు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి.. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్న ఓ పెద్దాయన…
Telangana Elections: చెదురుముదురు సంఘటనల మినహా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు కదులుతున్నారు.
పాతబస్తీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. మలక్ పేట్, చార్మినార్, యాకుత్ పురా, చంద్రయాన్ గుట్ట, బహదూర్ పురా, కార్వాన్, గోషామహల్ ఏడు నియోజకవర్గాలో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. పాతబస్తీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టవంతమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నియమించారు.
EC Suspends Hyderabad Police Officers: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసు అధికారులను బుధవారం ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. ఓటర్లకు డబ్బులు పంచుతున్న ఎమ్మెల్యే కొడుకుకు సహకరించినందుకే వారిపై సస్పెన్షన్ వేటు పడింది. వారు ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్, ఏసీపీ యాదగిరి, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్ల. వివరాలు.. మంగళవారం రాత్రి ముషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ అపార్టుమెంటులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొడుకు జయసింహా ముఠా ఓటర్లకు డబ్బులు…
Hyderabad: తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రేపు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలింగ్ శాతం పెంచేందుకు స్కూల్స్, కాలేజీలతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కూడా ఈసీ సెలవులు ప్రకటించింది. అలాగే రేపు నగరంలోని పార్కులు కూడా మూతపడనున్నాయి. రేపు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పార్కులు బంద్ కానున్నాయి. జంట నగరాలలోని అన్ని పార్కులు మూసివేస్తున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. రేపు పోలింగ్ సందర్భంగా…
హైదరాబాద్ జిల్లాలో మొట్ట మొదటి సారిగా పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటు వేసే క్యూ లైన్ వివరాలు తెలుసుకునేందుకు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ వినూత్న చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశ్యంతో పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ లైన్ తెలుసుకునేందుకు పోల్ క్యూ రూట్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చును.. జీహెచ్ఎంసీ వెబ్ సైట్.. మై జీహెచ్ఎంసీ యాప్ లలో poll Q route యాప్ ను ఆక్టివేట్ చేశారు.
Rain Alert to Telangana: తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య భారతదేశంతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలపై ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సర్వం సిద్ధమవుతున్న క్రమంలో రాష్ట్రానికి వాతావరణ కేంద్రం వర్ష సూచన ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడనుందని కేంద్ర వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. Also…
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గగన్‌పహాడ్ లో ఈ ఫైర్ యాక్సిడెంట్ సంభవించడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులతో బయటకు పరుగులు తీశారు. థర్మాకోల్ తయారీ కంపెనీలో ఈ మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.