KTR: తెలంగాణ రాజకీయాలు శ్వేతపత్రం వర్సెస్ స్వేద పత్రం అన్నట్టు కొనసాగుతుంది. అసెంబ్లీ వేదికగా రెండు రోజుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రాలలో తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పింది. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం కొనసాగిందంటూ గత బీఆర్ఎస్ పాలనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేత పత్రానికి కౌంటర్ గా తెలంగాణలో సాధించిన ప్రగతి, సృష్టించిన సంపద తదితర అంశాలపై స్వేద పత్రం విడుదల చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది. ఈ మేరకు ఇవాళ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
Read Also: Salaar: మూడు తెగల పేర్లు చెప్పండి… స్పెషల్ గిఫ్ట్ పట్టేయండి
ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని కేటీఆర్ వెల్లడించారు. దీంతో ఈరోజు కేటీఆర్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. తెలంగాణలో తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం, రాత్రి పగలు తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బ తీస్తే సహించబోమని చెప్పిన కేటీఆర్.. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రేపు ఇవ్వబోతున్నట్లుగా చెప్పడంతో అందరు షాక్ అవుతున్నారు. అయితే ఇవాళ ఎందుకు వాయిదా వేశారు అనే విషయాన్ని బీఆర్ఎస్ ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఏది ఏమైనా సరే అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి.