తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. గత వారం పది రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలంటే చలి జనం వణికిపోతున్నారు.
Hyderabad: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య కలకలం రేపుతుంది.గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న చక్రపాణి గురువారం ఉరివేసుకున్నాడు. అతడి ఆత్మహత్యకు లవ్ ఫెయిల్యూర్ కారణమని తెలుస్తోంది. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. నంద్యాలకు చెందిన చక్రపాణి గచ్చిబౌలిలోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. దీంతో అతడు స్థానికంగా ఓ పిజి హాస్టల్లో నివాసం ఉంటున్నాడు.…
రెండేళ్లకు ముందు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మరి ఇప్పుడు కొత్త వేరియంట్ లతో భయపెడుతుంది. పలు రకాల వేరియంట్లతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మొదటగా కేరళలలో మొదలైన కొత్త వేరియంట్ జేఎన్ 1.. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వ్యాపిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. తప్పనిసరిగా కొవిడ్ ఆంక్షలు పాటించాలని ప్రభుత్వాలు పేర్కొంటున్నాయి. కొత్త వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తు్న్నాయి.
లోన్ యాప్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తమ వద్ద నుంచి తీసుకున్న రుణాలు తిరిగి ఇవ్వడం లేదని.. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొని, మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. దీంతో.. బాధితులు అవమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా.. హైదరాబాద్ లో లోన్ యాప్ వేధింపులతో ఓ యువకుడు బలయ్యాడు.
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా మాజమంత్రి జగదీష్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ అనేది పచ్చి అబద్ధం అని కోమటిరెడ్డి చెప్పారు.
హైదరాబాద్ కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ కుమార్ (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టాడు నిందితుడు గోపి. హత్య చేసిన అనంతరం ఓ డస్ట్ బిన్ లో మృతదేహాన్ని నిప్పు పెట్టి తగలబెట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో పరిశీలించి నిందితుడిని గుర్తించారు. ఈ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Husband kills his wife in Miyapur: 18 ఏళ్లుగా కలిసి జీవించిన భార్యను భర్త అతి కిరాతకంగా చంపాడు. ఆపై భార్య కనిపించట్లేదని డ్రామాలాడాడు. చివరకు మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అసలు విషయం బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మియాపూర్లో చోటుచేసుకుంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న మియాపూర్ పోలీసులు.. భర్తను రిమాండ్కు తరలించారు. మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్, ఎస్సై గిరీష్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్కు…
The body has been in the house for a week: కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోయినా.. తల్లి, సోదరుడు గుర్తించలేకపోయారు. మృతదేహం ఇంట్లోనే కుళ్లిపోయి, పురుగులు పడుతున్నా.. ఎప్పటిలానే వారు సాధారణ జీవితం గడిపారు. దుర్వాసన వస్తుండగా.. పక్కింటి యువకులు లోపలి వెళ్లి చూడగా అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని చింతల్లో చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు…
తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మహిళలకు ఆర్టీసీలో ఉచితం చేసింది.. దాంతో మహిళా ప్రయాణికులు అంతా బస్సులకు వెళ్తున్నారు.. ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి మహిళలు అధిక సంఖ్యలో ఉపయోగించు కుంటుండంతో.. తాజాగా మెట్రో స్టేషన్స్, ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ వద్ద మహిళల సంఖ్య భారీగా తగ్గింది.. ఎక్కువ మంది లేటు అయినా పర్లేదు అలానే వెళ్తామంటున్నారు.. రైళ్లలో లేడీస్ రష్ కంటే మగవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే మెట్రో స్టేషన్స్ వరకు, అలాగే మెట్రో…
CM Revanth Reddy: ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి సీఎం వెళ్లనున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం రేవంత్ ఇవ్వనున్నారు.