CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు. నేటి ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ రానున్న జగన్, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు. ఉదయం 11:30 గంటలకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించనున్న వైఎస్ జగన్. గత నెల 8వ తేదీన కేసీఆర్ గజ్వేల్ ఫాంహౌజ్‌లో కాలుజారి పడడంతో తుంటి ఎముక విరిగన సంగతి తెలిసిందే. అనంతరం హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకున్నారు. కొద్దికాలం కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
Read also: Cock Fightings: కోడి పందాలు.. జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్
కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల నాయకులు, బీఆర్‌ఎస్ నేతలు ఆయనను పరామర్శించారు. అనంతరం కేసీఆర్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో గల ఆయన పూర్వ నివాసానికి వెళ్లారు. అక్కడే కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కేటీఆర్‌కు ఫోన్ చేసిన ఆరోగ్యం గురించి ఆరా తీశారు సీఎం జగన్. కాగా ఇవాళ సీఎం జగన్ నేరుగా వెళ్లి పరామర్శించనున్నారు. కేసీఆర్ ఇంటికి వెళ్తున్న జగన్ లంచ్ మీటింగ్‌కు హాజరవుతారని సమాచారం.
Read also: IND vs SA: ఏడాది తర్వాత టాప్-10లోకి విరాట్ కోహ్లీ!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గతేడాది డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి జారిపడటంతో ఎడమ తుంటి ఎముక విరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. అనంతరం సీనియర్ వైద్యులు నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కేసీఆర్‌కు సూచించారు. డిసెంబర్ 15న కేసీఆర్ డిశ్చార్జ్ కావడంతో వైద్యులు ప్రతిరోజూ నేరుగా పర్యవేక్షిస్తున్నారు.
Cock Fightings: కోడి పందాలు.. జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్