హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అదృశ్యమైన కొడుకు 20 రోజల తర్వాత శవమై దొరికిన ఘటన దిల్షుఖ్ నగర్ చాదర్ ఘాట్‌లో జరిగింది. తమ కొడుకు మృతి దాచి పోలీసుల అలసత్వం చేయడం వల్ల తమ కొడుకు 18 రోజులు అనాధ శవంగా పడి ఉన్నాడంటూ ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతరమయ్యారు. వివరాలు.. 20 రోజుల క్రితం శ్రవణ్ (23) చాదర్‌ఘాట్ పరిధిలో ప్రమాదానికి గురయ్యాడు. 6వ తేదీ అర్థరాత్రి గుర్తు తెలియని కారు అతడిని ఢీకొట్టడంతో…
29 MMTS Trains Cancelled in Hyderabad: హైదరాబాద్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో పలు మార్గాల్లో నడువనున్న 29 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. పలు ఆపరేషనల్ కారణాలతో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. ప్రయాణికులు తమకు సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. సికింద్రాబాద్, లింగంపల్లి, ఉందానగర్, ఫలక్‌నుమా మార్గాల్లో నడిచే రైళ్లు రద్దు అయ్యాయి. లింగంపల్లి-ఉందానగర్ (47213), ఉందానగర్-లింగంపల్లి (47211), ఉందానగర్-సికింద్రాబాద్ (47246),…
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించించింది. నగరంలో ఓ హస్పిటల్లో ఒక్కసారిగా భారీ మంటలు ఎగసిపడ్డాయి. అత్తాపూర్ మెట్రో పిల్లర్ 60 సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకుర్ ఉమెన్ హాస్పటల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐదో ఫ్లోర్ నుంచి పదో ఫ్లోర్ వరకు మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన పేషెంట్లను బయటకు పంపించారు. అనంతరం ఈ ఘటనపై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. Also…
Hyderabad:నాపంల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గిగ్ వర్కర్స్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఎన్నికల ముందు గిగ్ అండ్ ప్లాట్ ఫార్మ్ వర్కర్లకు న్యాయం చేస్తానని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు శనివారం ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్విగ్గి, జొమాటో, ఆటో డ్రైవర్లు, గిగ్ ప్లాట్ ఫార్మ్ కిందకు వచ్చే ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్, స్విగ్గి,…
తెలుగు వారికి, తెలంగాణ వారికి, భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నర్సింహ రావు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన భారత దేశాన్ని గాడిన పెట్టీ తన వంతు సేవ దేశానికి అందించారు.. పీవీ ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలి.. ఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలి అని ఆయన డిమాండ్ చేశారు.
ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని కేటీఆర్ వెల్లడించారు. దీంతో ఈరోజు కేటీఆర్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.
సైబరాబాద్ పరిధిలో గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగిందని కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి తెలిపారు. గతేడాది 27, 322 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 29, 156 కేసులు రిజిస్ట్రల్ అయ్యాయి.. మహిళలపై నేరాలు తగ్గాయి.. ఈ ఏడాది 105 హత్య కేసులు నమోదు కాగా, సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి..
ఇవాళ సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం. ఆటో, ఊబర్ వాహానాల డ్రైవర్లతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు వర్దంతి సందర్భంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లోని పీవీ జ్ఞానభూమి వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివాళులు ఘటించారు.