మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కీలక సూచన చేసింది. తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన అభివృద్ధి, సృష్టించిన సంపదను తెలిపేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్ వేదికగా ఇవాళ ఉదయం 11 గంటలకు ‘స్వేద పత్రం’ రిలీజ్ చేయనున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు.
CP Kothakota Srinivas Reddy: ఇన్స్పెక్టర్లకు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖలో పోస్టింగ్ విషయంలో కొందరు ఇన్స్పెక్టర్లు ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. పోస్టింగ్‌ల కోసం సిఫార్సు లేఖలతో వస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. Also Read: Coronavirus: కరోనా అలజడి.. తెలంగాణలో కొత్తగా 9 పాజిటివ్ కేసులు సిఫార్సు లేఖలు పట్టుకొచ్చే…
మైనార్టీలకు రక్షణ కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సేమి క్రిస్మస్ వేడుకలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మత సామరస్యాన్ని కాపాడేందుకు శయా శక్తుల ప్రయత్నం చేస్తాం. దేశంలో మైనార్టీలకు రక్షణ కాంగ్రెస్ పార్టీ కల్పించింది. డిసెంబర్ నెల మిరాకిల్ మంత్.. నేను చెప్పింది వాస్తవం. ప్రపంచానికి డిసెంబర్ నెల మిరకిల్ మంత్. పాపులను కాపాడాడు యేసు క్రీస్తు. మైనార్టీ…
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై వాహనదారులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. పేరుకుపోయిన చలాన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు చలాన్లపై ఈ డిస్కౌంట్ కొనసాగనుంది.. సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై తగ్గింపును గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.. ఈ చలాన్ ట్రాఫిక్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు.
తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. కఠోర దీక్షతో తెలంగాణాను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.. డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలి అని రేవంత్ రెడ్డిసూచించారు.
పార్లమెంట్లో విపక్ష పార్టీలకు చెందిన 146 మంది ఎంపీలను సస్పెన్షన్ చేయడంతో ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ధర్నా నిర్వహించనున్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు.
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించనున్న క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా నగరంలో పోలీసులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. మరో వైపు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నేడు ఎట్ హోం కార్యక్రమం దృష్ట్యా కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు.
వాహనదారులకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అదిరిపోయే శుభవార్త చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ రెడీ అవుతుంది.