Wings India 2024: సాధారణ పౌరుడికి సైతం విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం: జ్యోతిరాదిత్య సింధియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక ఎయిర్ క్రాఫ్ట్‌లను కొనుగోలు చేస్తోందని.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎంతో ముందుకు దూసుకుపోతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. సాధారణ పౌరుడికి సైతం విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రధాని సంకల్పించారని, ఆ దిశగా సరలీకరిస్తున్నామని జ్యోతిరాదిత్య తెలిపారు. బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో ‘ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024’ వైమానిక ప్రదర్శనను గురువారం ఆయన ఆరంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు.
‘పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. విమాన ప్రయాణికులు క్రమంగా పెరుగుతున్నారు. దానికి తగినట్లుగా తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రపంచంలోనే ఇండియా విమాన ప్రయాణికుల పరంగా మూడో స్థానంలో ఉంది.
దేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి 2047లో విమానయాన రంగం 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నాము. గత 10 ఏళ్లలో ఎంతో ప్రగతి సాధించాము. ముంబై, ఢిల్లీలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాము. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో హెలిపాడ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. ఈ రోజు పలు విమానయాన సంస్థల మధ్య ఒప్పందాలు జరిగాయి’ అని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
Also Read
Also Read: Wings India 2024: బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో ‘ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024’ ప్రదర్శన ప్రారంభం!
’15 శాతం మహిళలు పైలట్లు, కెప్టెన్లుగా ఉన్నారు. ప్రపంచంలోనే ఇది అధిక శాతం. డ్రోన్లకు ఎంతో డిమాండ్ పెరిగింది. ఇందులో భాగంగా డ్రోన్ మహిళ పైలట్లను తీర్చిదిద్దుతున్నాము. ఉడాన్ 5.3 ఈ రోజు ప్రాంబించడం ఎంతో సంతోషంగా ఉంది. పౌర విమానయాన చరిత్రలో ఇది నిలిచిపోయే రోజు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక ఎయిర్ క్రాఫ్ట్‌లను కొనుగోలు చేస్తోంది. ప్రధాని మోడీ నేతృత్వంలో ఎంతో ముందుకు దూసుకుపోతున్నాం. సాధారణ పౌరుడికి సైతం విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని మోడీ సంకల్పించారు. ఆ దిశగా సరలీకరిస్తున్నాము. ఆకాశమే మన హద్దు’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!