MP Vallabhaneni Balasouri: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల.. మార్పులు, చేర్పులు.. కొందరు నేతల్లో అసంతృప్తికి కారణం అయ్యాయి.. సిట్టింగులకు సీటు రాకపోవడంతో.. కొందరు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వంతు వచ్చింది.. ఈ సారి ఆయనకు టికెట్ దక్కకపోవడంతో.. ఇప్పటికే జనసేన పార్టీతో టచ్‌లోకి వెళ్లగా.. ఈ రోజు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో సమావేశం కానున్నారు.. హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి ఈ రోజు ఉదయం 11 గంటలకు వెళ్లనున్న ఎంపీ బాలశౌరి.. జనసేనానితో చర్చలు జరపనున్నారు.. వచ్చే ఎన్నికల్లో జనసేనలో ఆయన పాత్ర ఏంటి? ఏ స్థానం నుంచి పోటీ చేయాలి..? అనే అంశాలపై పవన్‌తో చర్చించబోతున్నారు.. అయితే, మచిలీపట్నం లేదా గుంటూరు లోక్ సభ నుంచి జనసేన పార్టీ తరపున వల్లభనేని బాలశౌరి బరిలోకి దిగే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది. పవన్ కల్యాణ్‌తో జరిగే భేటీలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..
Read Also: Salaar OTT Release Date: అభిమానులకు శుభవార్త.. ‘సలార్’ ఓటీటీ డేట్ వచ్చేసింది!
కాగా, ఈ మధ్యే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే.. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి పంపారు.. పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యత దక్కకపోవడంతోనే ఆయన పార్టీ వీడారట.. మరోవైపు.. ఆయన వైసీపీకి రాజీనామా చేయకముందే.. పార్టీని వీడుతారనే ప్రచారం సాగుతూ వచ్చింది.. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో సీఎం వైఎస్ జగన్ ఫొటోలకు తొలగించడం కూడా చర్చగా మారింది.. మొత్తంగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడం ఖాయమైంది.