భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని మోడీకి ఎయిర్ పోర్టులో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
ప్రధాని మోడీ రాకతో మార్పులు చేశారు. దాదాపు 50 నిమిషాలు ఆలస్యంగా ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. 7:50 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉండగా.. ఆలస్యం కారణంగా రాత్రి 8:40 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.
ప్రధాని మోడీ కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 7.50కు బేగంపేట ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. ఈ సందర్భంగా సిటీలో హై అలెర్ట్ ప్రకటించారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. కాగా.. ఈరోజు రాత్రికి ప్రధాని మోడీ రాజ్ భవన్ లో బస చేయనున్నారు. అనంతరం.. రేపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు.
హైదరబాద్ నగర శివారులోని నార్సింగ్ లో హిట్ అండ్ రన్ ఘటన ఈ రోజు చోటు చేసుకుంది. అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔటర్ రింగ్ రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ ఆర్మీ ఉద్యోగి కునాల్ ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. ఉద్యమ స్ఫూర్తీతో పని చేయాల్సిన నాటి ప్రభుత్వం గాలికి వదిలేసింది అని విమర్శించారు. కల్వకుంట్ల ఉద్యోగాలు ఊడగొట్టిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.
BJP : భారతీయ జనతా పార్టీ (బిజెపి) 2024 లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ పొందిన అభ్యర్థుల్లో హైదరాబాద్, తెలంగాణకు చెందిన మాధవి లత కూడా ఉన్నారు.
Hyderabad Kidnapping Case: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో కిడ్నాప్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో హైదరాబాద్ లోని మాదన్నపేటలో 9 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది.
హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొంటూ చట్టం తెచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఏపీ విభజన చట్టం 2014 ప్రకారం.. తెలంగాణ, ఏపీల మధ్య ఆస్తులు, అప్పులు, తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తికాలేదని పేర్కొంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజాసంక్షేమ సేవాసంఘం కార్యదర్శి…
Half Day Schools: తెలంగాణలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ హాఫ్ డే స్కూళ్లను నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది.
Radisson Drugs Case: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రాడిసన్ డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.