ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ నగర వాసులకు రంజాన్ నేపథ్యంలో కీలక సూచన చేశారు. ఏప్రిల్ 11న రంజాన్ పర్వదినం సందర్భంగా హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా మీర్ ఆలం ఈద్గా, మాసబ్ ట్యాంక్ పరిధిలోని హాకీ గ్రౌండ్స్ లో ఈదుల్ పితర్ ప్రార్థనల నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల సమయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. వీటితోపాటు..
Also Read: Dangerous Dogs : కేంద్రం ఇచ్చిన ఆ ఉత్తర్వులను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు..!
మీర్ ఆలం ఈద్గా, మాసబ్ ట్యాంక్ పరిధిలోని హాకీ గ్రౌండ్స్ ప్రాంతాల వారు ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయంగా.. బహదూర్ పూర చౌరస్తా వద్ద కిషన్ బాగ్, కామాటి పురా, పురానా పుల్ వైపు వెళ్లవచ్చు వారు. మరోవైపు ఈద్గా వైపు వెళ్లే వారు శాస్త్రిపురం, ఎన్ఎస్ కుంట తదితర ప్రాంతాల వైపు ట్రాఫిక్ ను మళ్లిస్తుండగా.. ఇక కాలపత్తార్ వద్ద మోచీ కాలనీ, బహదూర్ పురా, శంషీర్ గంజ్, నవాబ్ సాహెబ్ కుంట వైపు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు మళ్లిస్తారు. ఇక పురాన పూల్ నుండి బహదూర్ పురా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను, ఇతర వాహనాలను జియగూడ వైపు, రాజేంద్ర నగర్ నుండి బహదూర్ పురా వైపు వెళ్లే భారీ వాహనాలను ఆరంఘర్ జంక్షన్ వద్ద లేకపోతే శంషాబాద్, రాజేంద్రనగర్, మైలర్ దేవ్ పల్లి వైపు భారీ వాహనాలను మాలించే విధంగా చర్యలు చేపడుతున్నారు.
Also Read: Pat Cummins: సన్‌రైజర్స్ కెప్టెన్కు ఓ అభిమాని ‘హారతి’.. వీడియో వైరల్
ఇక హైదరాబాద్ లోని సిటీ మరోవైపు మాసబ్ ట్యాంక్ జంక్షన్ ఫ్లై ఓవర్ కింద కూడా పండుగా సందర్భంగా ప్రార్థనలు జరుగుతాయి. దింతో ఫ్లై ఓవర్ కింద వాహనాల రాకపోకలను అసలు అనుమతించరు. రేపు ఉదయం 7 నుండి 10 గంటల వరకు మెహదీపట్నం, లక్డీకపూల్ వైపు నుంచి ఫ్లై ఓవర్ పై మాత్రమే రాకపోకలు సాగించాలి. అలాగే బంజారాహిల్స్ రోడ్ నెం.12 నుంచి మాసబ్ ట్యాంక్ వైపు వచ్చే వాహనాలను రోడ్ నెంబర్12 జంక్షన్ నుంచి తాజ్ కృష్ణ హోటల్, ఆర్టీఏ ఖైరతాబాద్ వైపు మళ్లించనున్నారు. ఇక పంజాగుట్ట నుంచి తాజ్ కృష్ణ హోటల్, ఎర్ర మంజిల్ కాలనీ, ఆర్టీఏ ఖైరతాబాద్, నిరంకారి భవన్, లక్డీకపూల్, మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్, మెహాదీపట్నం వైపు వాహనాలను ధరి మార్చనున్నారు అధికారులు. రంజాన్ నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.