న్యాక్‌లో జాతీయ రహదారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, సెక్రటరీ హరీష్, ఐఏఎస్, ఎన్‌హెచ్‌ఆరోవో రజాక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర ఏబీవీపీ ఆందోళన చేపట్టారు. సంవత్సరాల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సమస్యల పైన నిత్యం విద్యార్థి పరిషత్ నుండి అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ పట్టించుకోవడంలేదనీ నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణలో రుతుపవనాలు విస్తరించడంతో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ 27న హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రేపు ( శుక్రవారం ) మధ్యాహ్నం 3 గంటలకు పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
Teacher Transfers: ఈ నెల 8వ తేదీన ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం అయింది. పదవీ విరమణకి 3 సంవత్సరాల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది.
హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తోంది. నగరం నలుమూలలా రియల్ ఎస్టేట్ వేగంగా వృద్ధి చెందుతోంది. భూముల ధరలు, ఇళ్ల నిర్మాణ ఖర్చు భారీ జరుగుతోంది. ప్రజలు సైతం విశాలమైన లేఔట్లలో అధునాత సౌకర్యాలతో నివాస గృహం ఉండాలని కోరుంటుకున్నారు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా తమ ఇల్లు ఉండాలని కోరుకుంటారు. సకల సౌకర్యాలు కల్పిస్తూ లగ్జరీ ఇళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రణవ గ్రూప్‌కు చెందిన ఈస్ట్ క్రెస్ట్.
హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పరిధిలోని హసన్ నగర్ లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వెలుగులోకి వచ్చింది.
సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసింది అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కు అయి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని కేటీఆర్ ఆరోపణలు చేశారు.
MLA Rajasingh: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మర్డర్లకు అడ్డాగా ఓల్డ్ సిటీ మారిందన్నారు. ఈ నెలలోనే అత్యధికంగా మర్డర్లు జరిగాయి.. ఓల్డ్ సిటీలో తెల్లవారు జామున 2, 3, 4 గంటల వరకు దుకాణాలు, హోటళ్లు తెరిచే ఉంచుతున్నారు.. దుకాణాలను బంద్ చేసేందుకే పోలీసులు వారి విధులు వారు నిర్వర్తిస్తున్నారు.