Jishnu Dev Verma: తెలంగాణ గర్నవర్ గా జిష్ణుదేవ్ వర్మ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు.. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే.. టీజీ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణస్వీకారం చేయించారు.. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఆ తర్వాత కొత్త గవర్నర్‌కు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.. ఆ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు గర్నవర్ జిష్ణుదేవ్ వర్మ.
Read Also: Wayanad Landslide: ప్రకృతి విధ్వంసాన్ని తన కళ్లతో చూసిన వ్యక్తి.. ఏం చెప్పాడంటే..?
ఇకపోతే 1957 ఆగస్టు 15న స్వా తంత్ర దినోత్సవం రోజున జన్మించిన జిష్ణుదేవ్ వర్మ.. 2018 నుండి 2023 వరకూ త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పని చేశారు. అంతేకాకుండా గతంలో బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు. జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన 1990లో రామ జన్మభూమి ఉద్యమ సమయంలో పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే.. 1993లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు. బీజేపీ సీనియర్ నేతగా పార్టీలో పలు పదవుల్లో తనదైన పాత్ర పోషించారు. ఇక అప్పటి నుంచి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ రాబాదంతో.. త్రిపుర ప్రభుత్వంలో ఆయన మంత్రిగా విద్యుత్, గ్రామీణాభి వృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ధిక, ప్రణాళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖల బాధ్యతలను నిర్వహించారు.
Read Also: CM Chandrababu: 5 నూతన పాలసీలు, 4 చోట్ల కొత్త క్లస్టర్లు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
2018- 2023 కాలంలో త్రిపురలో 25 ఏళ్ల సుదీర్ఘ సీపీఎం పాలనను కూల్చివేసిన బీజేపీ నేతృత్వంలోని మొదటి ప్రభుత్వంలో జిష్ణు దేవ్ వర్మ డిప్యూటీ సీఎంగా పని చేశారు.. అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో.. తన సొంత నియోజకవర్గం చరిలంలో తిప్రహా ఇండిజినస్ పీపుల్స్ రీజనల్ అలయన్స్ అభ్యర్థి ప్రద్యోత్ కిషోర్ దెబ్బర్‌మన్ చేతిలో జిష్ణు దేవ్ వర్మ ఓటమిపాలయ్యారు.. పార్టీ, ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన.. రచయిత కూడా.. “వ్యూస్, రివ్యూస్ అండ్ మై పోయమ్స్” అనే పేరుతో ఓ పుస్తకాన్ని సైతం ప్రచురించారు. ఇక, ఈ నెల 27వ తేదీన జిష్ణు దేవ్ వర్మను తెలంగాణ మూడో గవర్నర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించిన విషయం విదితమే కాగా.. ఈ రోజు ఆయన ప్రమాణస్వీకారం చేశారు.