Mystery Behind the Bullets in Narsingi: నార్సింగిలో బుల్లెట్లు కలకలం రేపుతున్నాయి…! మొన్నటికిమొన్న ఓ బులెట్ ఇంట్లోకి దూసుకురాగా… తాజాగా ఓ బులెట్ మహిళ కాలికి తాకింది. దీంతో మహిళ గాయపడింది. ఇంతకూ ఈ బులెట్లు ఎక్కడినుంచి వస్తున్నాయనేది అంతు చిక్కడం లేదు. చుట్టూ ఆర్మీ ఏరియా కావడంతో.. అక్కడి నుంచి వచ్చి ఉంటాయని భావించినప్పటికీ.. ఈ బులెట్లు తమవి కావని చెప్తున్నారు ఆర్మీ అధికారులు. ఇంతకూ గన్ ఫైర్ చేసిందెవరు..? ఎక్కడో గన్ పేలితే.. మరెక్కడో ఉన్న ఇంట్లోకి బులెట్లు ఎలా దూసుకొస్తున్నాయ్..?? మిస్టరీ గా మారింది.
Read Also: Jishnu Dev Verma: తెలంగాణ కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం.. ఎవరు ఈ జిష్ణుదేవ్ వర్మ..?
ఇది నార్సింగ్ పరిధిలోని గంధంగూడ ఏరియా. ఈ ఇంట్లోకే ఈరోజు ఉదయం బులెట్ దూసుకొచ్చింది. బట్టలు ఆరేస్తున్న మహిళ పద్మ కాలుకు బులెట్ తాకడంతో గాయపడింది. ఇంటికి గేట్ సందులో నుంచి.. పెద్ద శబ్ధంతో బులెట్ దూసుకొచ్చి పద్మ కాలును తాకుతూ బులెట్ దూసుకెళ్లింది. ఉతికిన బట్టలు ఆరేసేందుకు ఇంటి గేట్ వద్ద తాడు కడుతున్న పద్మ కు పెద్ద శబ్ధం వినపడింది. కాలికి ఏదో తికినట్టు అయ్యింది. చూసేలోపు కాలి నుంచి రక్తం కారుతోంది. ఎవరో రాయితో కొట్టిఉంటారని భావించి.. గేటు బయట వెతికింది పద్మ. బయట ఎవరూ లేరు. లోపల గేటుకు కొద్ది దూరంలో ఓ బులెట్ కనిపించింది. ఒక్కసారిగా షాక్ అయ్యింది. వెంటనే 100 కి డయల్ చేసి సమాచారం ఇచ్చింది.
Read Also: Jishnu Dev Verma: తెలంగాణ కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం.. ఎవరు ఈ జిష్ణుదేవ్ వర్మ..?
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బులెట్ స్వాధీనం చేసుకున్నారు. ఏకే-47 గన్ కి చెందిన బులెట్ గా అనుమానిస్తున్నారు పోలీసులు. బులెట్ కాలికి కాకుండా శరీరంలో ఎక్కడ తాకినా తీవ్రంగా గాయపడేదానినని.. తలకు తాకి ఉంటే ప్రాణమే పోయేదని వాపోతోంది బాధితురాలు పద్మ. పద్మకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేపించారు నార్సింగ్ పోలీసులు. ప్రస్తుతం పద్మకు ఎలాంటి అపాయం లేదని చెప్తున్నారు. చుట్టూ ఇళ్లు..! పద్మ కూడా ఆరుబయట కాకుండా ఇంటి లోపల ఉంది. వేసిన గేటు వేసినట్టే ఉంది. ఇంటి ఎదురుగా కూడా ఓ బిల్డింగ్ ఉంది. కానీ.. ఆ బులెట్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాని పరిస్థితి. గంధంగూడ ప్రాంతం అంతా ఆర్మీ ఏరియా కావడం.. తరుచూ సైనికులు గన్ ఫైరింగ్ ట్రైనింగ్ నిర్వహిస్తుండటంతో.. బులెట్ అక్కడి నుంచి వచ్చి ఉంటుందని భావించారు. కానీ.. ఆ బులెట్ తమకు చెందింది కాదని తేల్చి చెప్తున్నారు ఆర్మీ అధికారులు. దీంతో.. పోలీసులు అయోమయంలో పడ్డారు. బులెట్ ఆచూకీ తెలుసుకునేందుకు తంటాలు పడుతున్నారు.
Read Also: Wayanad Landslide: గురువారం వయనాడ్‌కి రాహుల్, ప్రియాంకా గాంధీలు..
ఇదే ప్రాంతంలో పది రోజుల క్రితం కూడా ఓ ఇంట్లోకి బులెట్ దూసుకొచ్చింది. బెడ్ రూమ్ వెంటిలేటర్ విండో నుంచి బులెట్ వచ్చింది. గమనించిన ఇంటి యజమాని.. బులెట్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఆ సమయంలో బెడ్ రూమ్‌లో ఎవరూ లేకపోవడంతో.. ప్రమాదం తప్పింది. అటు ఆర్మీ వాళ్లది కాదు.. పోలీసులదీ కాదు…!! మరి ఏ గన్ నుంచి ఆ బులెట్ దూసుకొచ్చింది..? ఎవరు గన్ ఫైర్ చేసి ఉంటారు..? చుట్టూ నివాస గృహాలు ఉన్నా బులెట్లు ఎలా వస్తున్నాయి అనేది మాత్రం అంతుచిక్కడం లేదు. మహిళా కాలు లోంచి దూసుకు వెళ్లిన బుల్లెట్టు తాము తాము పేల్చిందేనని ఆర్మీ అధికారులు తెరిచి చెప్పారు.. కానీ వారం రోజుల క్రితం మొదటి అంతస్తులకి దూసుకొని వచ్చిన బుల్లెట్టు మాత్రం తమది కాదని అధికారులు చెప్పారు.. అటు ఫైరింగ్ నుంచి బుల్లెట్ రాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది అన్నదానిపై పోలీసుల విచారణ కొనసాగుతుంది.