అల్వాల్ లో క్యాటరింగ్ వ్యాపారి హత్య కేసు రహస్యాన్ని పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఇంట్లో పని చేసే వ్యక్తి యజమాని ఇంటిపై కన్నేసి సంపదను దోచుకెళ్లేందుకు వేసిన పథకంలో భాగంగా యజమానిని హత్య చేసినట్లు పేట్ బషీర్ బాద్ ఏసీపీ రాములు తెలిపారు.
Minister Damodar Raja Narasimha: హైదరాబాద్ లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జూడాలు భేటీ అయ్యారు. ఆ తర్వాత నిరసన చేస్తున్న జూడాలు సమ్మె విరమించారు.
MIM MLA: మజ్లీస్ పార్టీకి చెందిన బహదూర్ పుర ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ రెచ్చిపోయారు. ఓ ప్రార్థన మందిరం సమీపంలో రోడ్డు పనుల పెండింగ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నంబర్ 82లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. జర్నలిస్టు కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న బహుళ అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో.. స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అయితే.. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరగడంతో.. పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. మంటలను చూసిన సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులు వెంటనే బయటకు పరుగులు తీశారు. కాగా.. ఈ ప్రమాదంపై వెంటనే…
బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల నేపథ్యంలో అమ్మవారి కళ్యాణోత్సవ ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మారకద్రవ్యాల రవాణాలో ఎంతటి పెద్దవారు ఉన్న ఉపేక్షించమని, ఉక్కు పాదంతో అణచివేస్తామన్నారు.
బాలిక గ్యాంగ్ రేప్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేరేడ్ మెట్ కి చెందిన యువకుడు విజయ్ కుమార్ కాచిగూడకి చెందిన మైనర్ బాలికను ట్రాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. విజయ్ కుమార్ కి కాచిగూడ కి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది.