JC Prabhakar Reddy Meets YS Vijayamma: వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్‌రెడ్డి భేటీ..
- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం..
- వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ..
- లోటస్‌పాండ్‌లోని విజయమ్మ నివాసానికి వెళ్లి కలిసిన జేసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy Meets YS Vijayamma: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.. హైదరాబాద్ వెళ్లిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను కలిశారు.. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని విజయమ్మ నివాసానికి వెళ్లి భేటీ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆమెతో అప్యాయంగా మాట్లాడారు.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, వైఎస్ హయాంలో జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం విదితమే.. వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు జేసీ దివాకర్‌రెడ్డి.. అయితే, వైఎస్ రెండో కేబినెట్‌లో జేసీ కుటుంబానికి మంత్రి పదవి దక్కలేదు..
Read Also: MQ-9B Drones: ‘హంటర్-కిల్లర్స్’ కొనుగోలుకు భారత్ ప్రతిపాదన..ఉగ్రవాదులకు చుక్కలే..!
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
ఇక, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీలు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. 2014 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా, ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి గెలుపొందారు.. ఆ త్వాత ఎన్నికల్లో వారి వారసులను బరిలోకి దింపినా.. విజయం సాధించలేదు.. ఇక, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ ట్రావెల్స్‌పై, తమపై కేసులు పెట్టి.. తీవ్రంగా వేధించారని జేసీ దివాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే.. ఈ కేసుల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి జైలు జీవితాన్ని కూడా గడిపారు.. జేసీ ట్రావెల్స్ కేసుల విషయంలో.. అధికారులపై కేసులు పెడతానంటూ హెచ్చరిస్తూ వస్తున్నారు జేసీ.. మరో వైపు తాజా ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. అయితే, జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇప్పుడు వైఎస్ విజయమ్మను కలవడం ఆసక్తికరంగా మారింది. తమ బద్ధ శత్రువు అయిన వైఎస్ జగన్ తల్లి విజయమ్మను జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎందుకు కలిశారు..? ఏం మాట్లాడారు అనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!