Mallu Bhatti Vikramarka: బోనాల జాతర కు ప్రభుత్వం 20 కోట్లు కేటాయించిందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజ బోనాల పండుగ సందర్భంగా.. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల పండుగ భూమి పుత్రుల పండుగ అని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరే పండుగ అన్నారు. నగర ప్రజలను కాపాడుతున్న లాల్ దర్వాజ్ మహంకాళి అమ్మవారు అని తెలిపారు.
Read also: PV Sindhu: పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు శుభారంభం.. తొలి మ్యాచ్‌లో విజయం
ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. బోనాల జాతరకు ప్రభుత్వం 20 కోట్లు కేటాయించిందని భట్టి తెలిపారు. 10 వేల కోట్లు హైదరాబాద్ నగర అభివృద్ధి కి కేటాయించిందని అన్నారు. నగర అభివృద్ధి కి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు వేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి భద్రత లకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించామన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని తెలిపారు. అన్ని విభాగలకు, దేవాలయ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.
Read also: Uttam Kumar Reddy: నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలే.. అధికారులకు మంత్రి వార్నింగ్..
మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం బోనాలతో సందడి నెలకొంది. లాల్‌దర్వాజ బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. పాతబస్తీలోనూ పండుగలు కొనసాగుతున్నాయి. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరికీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు. అమ్మవారు కరోనా లాంటి కరోనా బారి నుంచి ప్రజలందరినీ కాపాడాలన్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులంతా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈసారి అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురవాలని అన్నారు.
CM Revanth Reddy: సంప్రదాయాలతో నిండిన తెలంగాణకు మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం