Srisailam Project శ్రీశైలం డ్యామ్ క్రమంగా వరద పోటెత్తుతోంది.. తుంగభద్ర నది నుంచి భారీ ఎత్తున వరద వచ్చి శ్రీశైలం జలాశయంలో చేరుతోంది.. దీంతో.. శ్రీశైలం ప్రాజెక్టులో గంటకు ఒక టీఎంసీ చొప్పున నీటిమట్టం పెరుగుతోంది.. తుంగభద్ర జలాశయంలో 28 గేట్ల ద్వారా లక్ష 3 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.. పూర్తి స్థాయి నీటి మట్టం: 1633 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం:1631.09 అడుగులు..ఇన్ ఫ్లో 1,24,361 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 1,50,798 క్యూ సెక్కులు.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 98.218 టీఎంసీలు.. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తుంగభద్ర నుంచి నీటి విడుదల లక్షా 50 వేలకు పెంచే అవకాశం కూడా ఉంది. తుంగభద్ర నుంచి శ్రీశైలం డ్యామ్‌కు 3 లక్షల 40 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.. రోజుకు 25 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయంలో చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు..
Read also: Bhadrachalam: గోదావరికి వరదలు.. గోదావరిలోకి భక్తులను అనుమతించని పోలీసులు..
నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి భారీగా పెరుగుతుంది. ఇన్ ఫ్లో : 4,09,591 క్యూసెక్కులు..ఔట్ ఫ్లో : 62,214 క్యూసెక్కులు కాగా.. పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుతం : 870.10 అడుగులు.. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుగా ఉంది. ఇక ప్రస్తుతం : 142.0164 టీఎంసీలు కాగా.. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. కాగా మరోవైపు సుంకేసుల జలాశయం నుంచి 20 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు..జూరాల నుంచి ఇప్పటికే 2 లక్షల 51 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది.రాబోయే 15 రోజుల్లో కృష్ణ బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేరుతాయని అంచనా వేస్తున్నారు.. శ్రీశైలంకు ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోన్న నేపథ్యంలో.. సోమ లేదా మంగళవారాల్లో శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉందంటున్నారు.. కాగా, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు ఎత్తుతారు అంటూ ప్రకృతి ప్రేమికులు ఎదురుచూస్తుంటారు.. గేట్లు ఎత్తే సమయంలో.. పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు, భక్తులు తరలివస్తుంటారు.. ముఖ్యంగా పర్యాటకులు హైదరాబాద్ నుంచి పోటెత్తే అవకాశం ఉంది.
Chevireddy Mohith Reddy: చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని విడిచిపెట్టిన పోలీసులు