విడుదల తేదీకి ముందురోజే పెద్ద హంగామా చేస్తూ స్పెషల్ షోలు పడతాయి. బెనిఫిట్ షో పేరుతో సినిమాలు ప్రదర్శించి ఇష్టారాజ్యంగా టికెట్ రేట్లు పెడతారు. నటుల మీద అభిమానులకున్న పిచ్చిని ఫుల్ గా క్యాష్ చేసుకుంటున్నారు. బెనిఫిట్ షో సంస్కృతి పాతదే అయినా.. గతానికీ, ఇప్పటికీ బెనిఫిట్ షోలు పూర్తిగా మారిపోయాయని మాత్రం చెప్పక తప్పదు.
బీజేపీ ఎందుకు...అల్లు అర్జున్‌కు సపోర్టు చేసేలా మాట్లాడుతుందనే చర్చ జనాల్లో జరుగుతోంది. మహిళ మరణించడం బాధాకరం అంటూనే...ఆ మహిళ కుటుంబాన్ని ప్రభుత్వం, అల్లు అర్జున్ పట్టించుకోవాలని కాషాయ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు ఆ సంఘటన జరిగి ఉండాల్సింది కాదని అంటున్న కమలం నేతలు...అనుమతి లేకున్నా అయనను ఎలా రోడ్ షో చేయించారని ప్రశ్నిస్తున్నారు.
ఓ యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో మరో యువతి బలి అయింది. ర్యాష్ డ్రైవింగ్ ఓ ప్రాణాన్ని మింగేసింది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పరిధిలో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీటెక్ స్టూడెంట్ శివాని (21) అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ పై వెళ్తుండగా స్కోడా కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడు వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి.
నగరంలోని పలు చెరువులను హైడ్రా కమీషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదుల రావడంతో రంగనాథ్ తనిఖీలు చేపట్టారు. నానక్‌రామ్ గూడకు చేరువలో ఉన్న తౌతానికుంట, భగీరథమ్మ చెరువు, నార్సింగ్‌లోని నెక్నాంపూర్ చెరువుల ఆక్రమణలపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐకియా వాహనంలో గంజాయి సరఫరాపై ఐకియా యాజమాన్యం స్పందించింది. తమ వాహనాల్లో మత్తు పదార్థాలను తరలించడాన్ని తీవ్రంగా ఖండించింది. తమ కంపెనీ ఫర్నీచర్ హోం డెలివరీ చేసే ప్రక్రియ థర్డ్ పార్టీ వెండర్ ఆధీనంలో జరుగుతుందని ఐకియా క్లారిటీ ఇచ్చింది. ఈ ఘటనలో తమకు ఎలాంటి ప్రమేయం ఉండదని తెలిపింది.
దాడి ఘటనపై అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. తమ ఇంటి వద్ద జరిగిన ఘటన అందరూ చూశారని.. తమ ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారన్నారు. వారిపై కేసు పెట్టారని చెప్పారు. ఇంటి దగ్గరికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే.. పోలీసులు వాళ్ళను తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలై కిమ్స్‌లో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీ తేజ్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఈరోజు సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ తండ్రి, కుటుంబ సభ్యులతో మాట్లాడిన బండి సంజయ్.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్ లోని హీరో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించేందుకు ఓయూ జేఏసీ యత్నించింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి రూ. కోటి ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సర్వమతాలకు రక్షణగా ఉండాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి.
హైదరాబాద్ నగరంలో.. పెంపుడు కుక్క రోడ్డుపై మలవిసర్జన చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. మిగతా మున్సిపల్ ప్రాంతాల్లోనూ ఈ జరిమానా అమలు చేయాలని మున్సిపల్ శాఖ కమిషనర్ & డైరెక్టర్ శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు.