Hyderabad Police: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏడాదిలోనే సాధించిన అద్భుత విజయం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చొరవ, తన కృషికి దక్కిన ఫలితం ఆర్ఆర్ఆర్ టెండర్లు అని అభిప్రాయపడ్డారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించే రోజు అని తెలిపారు.
కోకాపేట్ సర్వీస్ రోడ్డులో బైక్ డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో.. బైక్ పై వెళ్తున్న విద్యార్థి స్వాత్విక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా.. అతని పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు.
రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణంలో పురోగతి లభించింది. హైదరాబాద్ నార్త్ పార్ట్‌కి కేంద్ర ప్రభుత్వం టెండర్స్ కాల్ ఫర్ చేసింది. నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ వే కి కేంద్రం టెండర్స్ పిలిచింది. సంగారెడ్డిలోని గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరకు టెండర్స్ పిలిచింది. మొత్తం నాలుగు పార్ట్స్‌గా రోడ్డు నిర్మాణానికి టెండర్స్ పిలిచింది. 5,555 కోట్ల రూపాయల పనులకు కేంద్రం టెండర్లను పిలిచింది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నామని తెలిపారు. హైడ్రాకు చైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారని వెల్లడించారు. 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో హైడ్రా పని చేస్తుంది.. తమ పరిధిలో 1025 చెరువులను గుర్తించామని రంగనాథ్ పేర్కొన్నారు.
ఈసారి రాష్ట్రం మీద బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ చేస్తోందన్న వార్తల నడుమ తెలంగాణ బీజేపీకి కొత్త సారధిగా ఎవరు వస్తారన్న సస్పెన్స్ డబుల్ అవుతోందట రాజకీయ వర్గాల్లో. ఇక పార్టీలో అంతర్గతంగా అయితే... చెప్పే పనేలేదు. ఏ ఇద్దరు నాయకులు కలిసినా... మాటలన్నీ కొత్త అధ్యక్షుడి గురించేనట. ఈ క్రమంలోనే పలువురు నాయకుల పేర్లు తెరపైకి వస్తూ... వాళ్ళ ప్లస్‌లు, మైనస్‌ల గురించి డిస్కస్ చేసుకుంటున్నాయి తెలంగాణ బీజేపీ శ్రేణులు. అదే సమయంలో ఇటువైపు సీరియస్‌గా…
సాఫ్ట్వేర్ ఇంజనీర్ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. కూకట్పల్లి ప్రాంతంలోని వసంత నగర్ బస్ స్టాప్‌లో భరత్ రమేష్ బాబు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గంజాయి అమ్ముతూ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు శుక్రవారం దొరికాడు. నిందితుడి నుంచి 1.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో ఆన్ లైన్ మార్కెట్ స్థాయి విపరీతంగా పెరిగింది. ప్రజలందరూ కూరగాయల నుంచి బ్యూటీ ప్రొడక్ట్స్ వరకు అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. పని ఒత్తిడి, ట్రాఫిక్, పలు కారణాలతో బయటకు వెళ్ల లేక ఆన్లైన్ షాపింగ్‌కి అలవాటు పడుతున్నారు.
Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో వర్చువల్ గా హాజరు అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.