Food Safety Rides: హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో వివిధ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు జరుపగా, కొన్ని రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించడం లేదని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఉలవచారు, మల్నాడు కిచెన్, ట్రైన్ థీమ్ రెస్టారెంట్ లలో తనిఖీలు నిర్వహించారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఈ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించిన తర్వాత నిబంధనలను పూర్తిగా అనుసరించడం లేదని అధికారులు తెలిపారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు, కొన్ని రెస్టారెంట్లలో కంట్రోల్డ్ ఫుడ్ పద్ధతులు పాటించడం లేదని తెలిపారు. రేట్లతో సహా, ఈ రెస్టారెంట్లలో నాన్ వెజ్ ఐటమ్స్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్లు అధికారుల గుర్తించారు. ఇది ఆహార పదార్థాలకు హానికరం కలిగిస్తాయని, ముఖ్యంగా ఆరోగ్యపరమైన రుగ్మతలు కలుగ చేస్తాయని తెలిపారు. అలాగే కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్టు గుర్తించారు అధికారులు.
Also Read: Robberies: ఖమ్మం జిల్లాలో అర్దరాత్రి దొంగల బీభత్సం
కొన్ని ఆహార పదార్థాలు కుళ్లిపోయాయని, రెస్టారెంట్లలో కుళ్లిపోయిన టమాటాలు వాడుతున్నట్టు అధికారుల గుర్తించారు. ఇది భోజనాల పై ప్రభావం చూపుతుందని, ఆరోగ్యానికి ప్రమాదకరమవుతుందని తెలిపారు. కిచెన్ పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. తుప్పు పట్టిన ఫ్రిజ్ లో ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేయడం వారి పరిశీలనలో వచ్చాయి. అలాగే ఆధికారులు, కొన్ని రెస్టారెంట్లలో ఎక్స్పైర్ అయిన ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఇతర ఆహార భద్రత నిబంధనలకు విరుద్ధంగా, కొన్ని రెస్టారెంట్లలో వెజ్, నాన్ వెజ్ వంటకాలను ఒకే ఫ్రిజ్లో నిల్వ చేయడం గుర్తించారు అధికారులు. అలాగే, కొన్ని రెస్టారెంట్లలో బటర్ అప్లై చేయడానికి పెయింటింగ్ బ్రష్ వాడుతున్నట్లు అధికారులు తెలిపారు.