భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భారతీయ సాహసయోధులైన సాహిబ్జాదా జొరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్‌లకు ఘన నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నగరంలో వాన దంచికొడుతుంది. అబిడ్స్, కోఠి, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.
హైదరాబాద్ శివారులో యువకులు రెచ్చిపోయారు. కొందరు యువకులు గన్‌తో హల్చల్ చేసిన ఘటన బాచుపల్లి స్పోర్ట్స్ క్లబ్ వద్ద చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ తుపాకీ గురిపెట్టి యువకులు వీరంగం సృష్టించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మరి కొన్ని రోజుల్లో 2024 సంవత్సరం ముగియనుంది. ఏడాది ఆఖరులో ఓయో ఓ నివేదికను విడుదల చేసింది. అత్యధికంగా ఓయో బుకింగ్‌లు జరిగిన నగరాల పేర్లను వెల్లడించింది. ట్రావెలోపీడియా 2024' నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం భారతదేశంలో మతపరమైన పర్యాటకంపై ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పూరీ, వారణాసి, హరిద్వార్ ప్రముఖ ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా నిలిచాయి. వీటితో పాటు దేవఘర్, పళని, గోవర్ధన్‌లలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది.
Hyderabad Crime: ఇంట్లో పనిచేస్తామంటారు.. నమ్మకంగా ఉంటామంటారు. వారి మాటలతో ఎదుటి వారిని మెప్పిస్తారు. ఇంటి పనికి ఒప్పుకుని ఇంట్లో వస్తువులపై నిఘా పెడతారు.
Sritej Health Bulletin : డిసెంబర్ 4న పుష్ప 2 (ది రూల్) ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య 70 ఎంఎం థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన 13 ఏళ్ల శ్రీతేజ్ సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడిల్స్‌లో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం సాయంత్రం, ఆసుపత్రి అధికారులు శ్రీతేజ్ ఆరోగ్యం గురించి తాజా బులెటిన్‌ను విడుదల చేశారు. వెంటిలేటర్ సహాయం లేకుండా ఊపిరి పీల్చు కోగులుగుతున్నాడని వైద్యులు వెల్లడించారు. అప్పుడప్పుడు శ్రీతేజ కళ్ళు తెర్వగలుతున్నాడని, కానీ ఐ కాంటాక్ట్…
ABV ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకోపన్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపి సభ్యులు సుధాన్ష్ త్రివేది హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వాజ్ పేయి స్ఫూర్తితో ఈ దేశ యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరామర్శించారు. అనంతరం.. కుటుంబ సభ్యులను బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ ఘటనను రాజకీయం చేయడం తగదని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.. సినీ రంగంలో మార్పులు చేర్పులు అవసరం అని కూనంనేని సాంబశివరావు అభిప్రాయ పడ్డారు.