నిత్య పెళ్లికొడుకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మోసాలకు పాల్పడుతున్న నిత్యపెళ్లికొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. విగ్గులు పెట్టుకుని వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు వంశీకృష్ణ అనే నిత్య పెళ్లికొడుకు.
సైకిల్ ట్రాక్ పైకప్పును తొలగించడంపై హెచ్ఎండీఏ వివరణ ఇచ్చింది. నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల నుంచి నానక్‌రామ్‌గూడ రోటరీ మీదుగా ఐటీ కారీడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శేర్లింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, ఐకియా, మాదాపూర్ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో రాకపోకలు కొనసాగుతున్నాయని తెలిపింది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో నానక్‌రామ్‌గూడ రోటరీ మొత్తం స్తంభిస్తున్నట్లు వెల్లడించింది.
ఈ-ఫార్ములా రేస్‌లో నిధుల దుర్వినియోగంపై విచారణ కోరుతూ ఏసీబీకి సీఎస్ శాంతి కుమారి లేఖ రాశారు. గవర్నర్ ఇచ్చిన అనుమతి లేఖను సీఎస్ జతచేసి పంపించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ-ఫార్ములా రేసు కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో విచారణకు గవర్నర్ సోమవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
సైబర్ నేరాల నివారణ కోసం సైబరాబాద్ పోలీసులు P.R.O.T.E.C.T పేరుతో సరికొత్త ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చారు. సైబరాబాద్ పోలీస్ రూపొందించిన P.R.O.T.E.C.T(ప్రొటెక్ట్) అనే ప్రాజెక్ట్‌ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినీత్‌లు లాంచనంగా ప్రారంభించారు. ఆన్లైన్ డిజిటల్ ప్రపంచంలో పౌరులకు అవగాహన కల్పించడం, ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ పని చేయనుంది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. శీతాకాల విడిది కోసం విచ్చేసిన రాష్ట్రపతికి హైదరాబాద్‌లోని హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌లు ఘన స్వాగతం పలికారు.
ఐటీ కారిడార్‌లో బొమ్మ తుపాకీ చూపించి దోచుకున్న ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పీఎస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలో గల తేవర్ బార్లో దోపిడీ జరిగింది. బొమ్మ తుపాకీతో బార్ సెక్యూరిటీ గార్డ్‌ను బెదిరించి, రూమ్‌లో బంధించి నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్, ఆపిల్ లాప్‌టాప్‌ను దుండగులు దోచుకెళ్లారు.
హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్‌ను నటుడు మోహన్‌బాబు పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులకు మోహన్‌బాబు క్షమాపణ చెప్పారు. తన వల్లే తప్పిదం జరిగిందని రంజిత్ తల్లి భార్య, పిల్లలను మోహన్ బాబు క్షమాపణలు కోరారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసునని.. నువ్వు తొందరగా రికవరీ కావాలి...ఉద్దేశపూర్వకంగా నిన్ను కొట్టలేదని రంజిత్‌తో మోహన్ బాబు అన్నారు.
Instagram Love : ఇన్ స్టాగ్రామ్ పరిచయం ఓ యువతి కొంపముంచింది. బెంగళూరులో ఇన్ స్టాలో ప్రేమ పేరుతో రూబియా(22)కు మహారాష్ట్రకి చెందిన మన్వర్(28) పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. 8 నెలల పాటు బెంగళూరులో యువతితో మన్వర్ సహజీవనం చేశాడు. అయితే.. 10 రోజుల క్రితం బెంగళూరులో పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో ఉంటున్న మన్వర్ తల్లితండ్రుల వద్దకి వచ్చారు జంట. మన్వర్ తల్లిదండ్రులు ఒప్పుకోకొకపోవడంతో ఇంట్లో గొడవ జరిగింది. భర్త మన్వర్ కూడా…
రేవతి కుటుంబానికి మరోసారి క్షమాపణ చెప్పిన అల్లు అర్జున్.. అనుకోకుండా జరిగిన ఈ ఘటన పట్ల చింతిస్తున్నట్టు పేర్కొన్నారు.. ఇక, చికిత్స పొందుతున్న రేవతి కుమారుడిని నేను వెళ్లి పరామర్శిస్తాను అని చెప్పారు అల్లు అర్జున్.. అంతే కాదు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని మరోసారి హామీ ఇచ్చారు..
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు అల్లు అర్జున్.. మృతి చెందిన రేవతి కుటుంబానికి సానుభూతి తెలిపిన ఆయన.. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని మీడియా ముఖంగా హామీ ఇచ్చారు..