ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటు అంశంపై సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ఆన్‌లైన్ విధానంలో ఈ సమీక్షకు హాజరుకానున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 1.20 గంటలకు విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి సీఎం చంద్రబాబు వెళ్ళనున్నారు. ఆశ్రమంలో వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.
సీఎం చంద్రబాబు సచ్చిదానంద స్వామి ఆశ్రమం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ హైటెక్స్ లో జరిగే వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సదస్సుకు సీఎం హాజరవుతయారు. ఈ సదస్సు సీఎం మాట్లాడనున్నారు. గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం పాల్గొన్న విషయం తెలిసిందే. అనంతరం పాలనా అంశాలపై మంత్రులతో సీఎం ముచ్చటించారు. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపై చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’.. రైతులు, మత్స్యకారులకు ఇచ్చే రూ.20వేల ఆర్థిక సాయంపైన చర్చ జరిగింది.