హైదరాబాద్ లాలాగూడ పీస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తల్లి మృతిని చూసి తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోగ్యం బాగా లేక తల్లి లక్ష్మి మృతి చెందింది. తల్లి మృతిని చూసి తట్టుకోలేక కుమారుడు అభినయ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ లెటర్ రాశాడు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటి పారుదల శాఖ) ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ పైన పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.
హైదరాబాద్ మధురానగర్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా మహిళా శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న అభివృద్ధి పురోగతిని, పని తీరును, పథకాల అమలును మంత్రి సమీక్షించారు. అంగన్వాడి కేంద్రాల సొంత భవనాల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క తెలిపారు.
ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క జెండా ఊపి 25 సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భార్యభర్తలు రోజంతా పనిచేసినా.. సాయంత్రం భార్య మాత్రమే ఇంట్లో పని ఎందుకు చేయాలి.. ఇద్దరూ చేయాల్సిందేనని అన్నారు. మహిళా సంఘాలకు లోన్ భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. 17 రకాల వ్యాపారాలతో మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం.. నాణ్యత, మంచి రుచితో ఆరోగ్యకరమైన చేపల వంటకాలు తయారు చేయండని సూచించారు.
ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటు అంశంపై సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు ఆన్లైన్ విధానంలో ఈ సమీక్షకు హాజరుకానున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 1.20 గంటలకు విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి సీఎం చంద్రబాబు వెళ్ళనున్నారు. ఆశ్రమంలో వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. సీఎం…
నేడు తెలంగాణ గ్రీన్ & రెన్యువబుల్ ఎనర్జీ పాలసీపై భాగస్వాములతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండును తీర్చడానికి.. జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్షాన్ని అందుకోడానికి.. తెలంగాణ ప్రభుత్వం కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రతిపాదిస్తుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని పాతబస్తీ, మదన్నపేట, ఉప్పర్ గూడాకి చెందిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. శబరిమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎరుమెలి నుండి పంపా నది శబరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ని మార్చబోతున్నారన్న వార్త పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. గడిచిన కొద్ది రోజులుగా మార్పు మాట వినిపిస్తున్నా... అంత కచ్చితమైన సమాచారం ఏదీ లేదు. కానీ... ఇప్పుడు మాత్రం మేటర్ వేరుగా ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవల జరిగిన సిడబ్ల్యుసి సమావేశం తర్వాత పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది అధిష్టానం.
మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఘటనలో వార్డెన్ ప్రీతి రెడ్డిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. రహస్యంగా కెమెరాలు పెట్టి రికార్డు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని సీఎంఆర్ కాలేజ్ విద్యార్థులు ఉదయం ఆందోళన చేపట్టారు. దీంతో.. కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థినిలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను తీసుకొస్తుంది. ఈ క్రమంలో మంత్రి సీతక్క రేపు సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించనున్నారు. ప్రజా భవన్ వేదికగా ఉదయం 9.30 గంటలకు మంత్రి వాహనాలను ప్రారంభించనున్నారు.