Fire Accident: మహేంద్ర షోరూంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!
- మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలోని మహీంద్రా కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం.
- భారీగా ఆస్థి నష్టం.
- మంటలు వ్యాపించకుండా తక్షణ చర్యలు చేపట్టిన ఫైర్ సిబ్బంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: హైదరాబాద్ లోని మాదాపూర్ కొత్తగూడ చౌరస్తాలో ఉన్న మహీంద్రా కార్ల షోరూంలో గురువారం రాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షోరూం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో అక్కడ గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైరింజిన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసారు. షోరూంలో పనిచేసే ఉద్యోగులు విధులు ముగించుకుని వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం సంభవించడం వల్ల ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది. షోరూమ్ లో 30కి పైగా కార్లు ఉన్నాయని అక్కడ పనిచేసే సిబ్బంది తెలిపారు. అవన్నీ మంటలకు ఆహుతి అయిపోయాని సమాచారం. అయితే ఈ ఘటన కారణంగా ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
Also Read: Sabitha Indra Reddy : యూజీసీ ముసాయిదా రాష్ట్రాల హక్కులను హరించేలా ఉంది
Also Read
అగ్నిమాపక సిబ్బంది షో రూమ్ పక్కనే ఉన్న సహస్ర్ ఉడిపి గ్రాండ్ హోటల్, పైన ఉన్న ఓయో రూమ్స్ కు మంటలు అంటుకోకుండా తక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. షోరూంలో నష్టం ఎంతవరకు జరిగిందనే విషయమై అధికారులు విచారణ జరుపుతున్నారు. అక్కడ పరిస్థితి చూస్తే మాత్రం భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదం వల్ల ట్రాఫిక్ సమస్య ఎదురైన రహదారిపై ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇంకా సంబంధిత అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
Kondapur, #Hyderabad. Fire broke out at a car showroom. Firefighters on site and responding to ensure it doesn’t spread, and police engaging in crowd control. Hope no one was hurt. Very worrying to see the devastation. pic.twitter.com/VmyzKZuP5h
— Divya K Bhavani (@divyakbhavani) January 23, 2025
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!