హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధమవుతుంది. ఈ క్రమంలో మరోసారి డ్రగ్స్ మహమ్మారి వెలుగు చూసింది. న్యూ ఇయర్ వేడుకల కోసం క్రాక్ అరేనా అనే పబ్ డ్రగ్స్ పార్టీ అరెంజ్ చేసింది. గచ్చిబౌలి పరిధిలోని ఓ ఈవెంట్లో డీజే పార్టీలో డ్రగ్స్ లభించింది. పార్టీకి వచ్చిన 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.
ఆంగ్ల నూతన సంవత్సరాది మరికొన్ని గంటల్లో రానుంది. ఈ క్రమంలో ప్రపంచమంతా వేడుకలకు సిద్ధం అవుతుంది. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు సేవలందించనున్నాయి. రేపు డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ సందర్భంగా రాత్రి 12.30 వరకు నడవనున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్య నాదెళ్ల తెలిపారు. హైదరాబాద్‌లోని సత్య నాదెళ్ల నివాసంలో ఆయనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం భేటీ అయింది. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను సత్య నాదెళ్ల ప్రశంసించారు.
సెల్ ఫోన్ వాడొద్దని తండ్రి మందలించడంతో కూతురు అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ పద్మశాలి టౌన్ షిప్లో వరుసు రాజు.. భార్య తన ఇద్దరు కుమారులు ఒక కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నారు. కుమార్తె ఆరతి (19) ఈసీఐఎల్‌లోని ఒక కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంటికి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు. అనంతరం.. సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ అవకాశాలపై చర్చిస్తున్నారు. తమ వ్యాపారాన్ని విస్తరించాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది.
గోవా నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి వాస్కోడిగామా రైల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. 43 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. గోవా వస్తున్న వాస్కోడిగామా రైల్లో మద్యం తీసుకు వస్తున్నారని సమాచారం అందింది. ఈ మేరకు ఏఈ ఎస్ జీవన్ కిరణ్, ఎస్ టి ఎఫ్, డిటిఎఫ్ సీఐలు సుభాష్ చందర్, బాలరాజు, ఎస్సైలు వెంకటేష్, రవిలతో పాటు 20 మంది సిబ్బంది శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు తనిఖీలు నిర్వహించారు. పలువురు వద్ద ఉన్న…
Hyderabad Police: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏడాదిలోనే సాధించిన అద్భుత విజయం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చొరవ, తన కృషికి దక్కిన ఫలితం ఆర్ఆర్ఆర్ టెండర్లు అని అభిప్రాయపడ్డారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించే రోజు అని తెలిపారు.
కోకాపేట్ సర్వీస్ రోడ్డులో బైక్ డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో.. బైక్ పై వెళ్తున్న విద్యార్థి స్వాత్విక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా.. అతని పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు.
రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణంలో పురోగతి లభించింది. హైదరాబాద్ నార్త్ పార్ట్‌కి కేంద్ర ప్రభుత్వం టెండర్స్ కాల్ ఫర్ చేసింది. నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ వే కి కేంద్రం టెండర్స్ పిలిచింది. సంగారెడ్డిలోని గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరకు టెండర్స్ పిలిచింది. మొత్తం నాలుగు పార్ట్స్‌గా రోడ్డు నిర్మాణానికి టెండర్స్ పిలిచింది. 5,555 కోట్ల రూపాయల పనులకు కేంద్రం టెండర్లను పిలిచింది.