Experium Eco Park: ఎక్స్‌పీరియం పార్క్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఎక్స్‌పీరియం పార్క్ ప్రారంభం.
- ఎక్స్‌పీరియం పార్క్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Experium Eco Park: హైదరాబాద్ నగర శివార్లలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ‘ఎక్స్‌పీరియం’ పార్క్ ప్రకృతి ప్రేమికులకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అద్భుత పార్కును నేడు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో రామ్‌దేవ్‌రావు సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ పార్కును రూపొందించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు మరికొంతమంది హాజరయ్యారు. ఈ పార్కులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25,000 జాతులకు చెందిన మొక్కలను సేకరించి నాటారు. అర్జెంటీనా, ఉరుగ్వే, మెక్సికో, సౌత్ అమెరికా, స్పెయిన్, ఇటలీ, న్యూగినియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా వంటి అనేక దేశాల నుంచి అరుదైన మొక్కలు, చెట్లు, రకాల స్టోన్స్, అందమైన శిలలను జాగ్రత్తగా సేకరించి గార్డెన్‌ను అందంగా తీర్చిదిద్దారు.
Also Read: Supreme Court: ఒక్కమాట కూడా వినకుండా చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ కొట్టివేత.. సుప్రీం తీవ్ర ఆగ్రహం
Also Read
ఈ అద్భుత పార్కును తీర్చిదిద్దేందుకు సుమారు రూ. 150 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. ఒక్కో ఆకారానికి రూ. 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వ్యయం చేశారు. పార్కులో ఏర్పాటు చేసిన ఇండియాలోనే అతిపెద్ద హంపీ థియేటర్ 1,500 మంది కూర్చునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే 30 అడుగుల ఎత్తులో 20 స్టెయిన్‌లెస్ స్టీల్ శిల్పాలను ప్రత్యేక ఆకర్షణగా రూపొందించారు. రూ. 50 కోట్ల వ్యయంతో 12 ఎకరాలలో మ్యాన్‌మేడ్ బీచ్ ప్రత్యేకంగా రూపొందించారు. నూతన వధూవరులకు, ఫొటోగ్రఫీ ప్రేమికులకు ప్రీ వెడ్డింగ్, ఫొటోషూట్ లకు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎక్స్‌పీరియం పార్క్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాకుండా, దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఇది హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే అద్భుత ప్రకృతి కోవెలగా నిలవనుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు